టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సహయ నటిగా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది నటి సత్య కృష్ణన్. తెలుగులో దాదాపు 60కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆనంద్, బొమ్మరిల్లు, సామాన్యుడు, రెడీ, దూకుడు, బాద్ షా, గోవిందుడు అందరివాడేలే, ఆడవాళ్లు మీకు జోహర్లు వంటి హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే ఇటీవలే ఓటీటీలో సూపర్ సక్సెస్ అయిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లోనూ నటించింది. నటి సత్య కృష్ణన్ వాయిస్ లో ఉన్న బేస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన సత్య కృష్ణన్.. ఇప్పుడు ఆడపాడదపా చిత్రాల్లో నటిస్తుంది. అలాగే అటు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా సత్య కృష్ణన్ కూతురు గురించి ఇప్పుడు నెటిజన్స్ ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఈ అమ్మాయి త్వరలోనే తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కాబోతుంది.
నటి సత్య కృష్ణన్ కూతురి పేరు అనన్య కృష్ణన్. ఇప్పటికే తెలుగులో గ్యాంగ్ స్టర్ గంగరాజు చిత్రంలో కీలకపాత్ర పోషించింది. ఊ అంటావా మావ ఊహు అంటావా మావ అనే సినిమాలో కనిపించింది. అయితే ఇప్పుడు మెయిన్ హీరోయిన్గా వెండితెరపై సందడి చేయబోతుంది. జబర్దస్థ్ రాకేష్ హీరోగా నటిస్తున్న కేసీఆర్ చిత్రంలో అనన్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంతోనే వెండితెరకు కథానాయికగా పరిచయం కాబోతుంది అనన్య. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది.
ఇది చదవండి : OTT Movie: అంతుచిక్కని రహస్యాలు.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. మైథిలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..
అయితే ఈసినిమా తర్వాత అనన్యకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏమేరకు అవకాశాలు వస్తాయో చూడాలి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అనన్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం అనన్యకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.