- Telugu News Entertainment Television ANR Centenary Special, Star Maa Parivaar Awards To Be Aired On Star MAA On 20th October 6PM
ANR 100: ఏఎన్నార్ శత జయంతి.. అక్కినేని ఫ్యామిలీ అతిథులుగా టీవీలో స్పెషల్ ప్రోగ్రామ్.. ఎక్కడంటే?
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, ప్రముఖ సినీనటుడు దివంగత డాక్టర్ క్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులందరూ ఈ టీవీ ప్రోగ్రామ్ లో సందడి చేయనున్నారు. అలాగే ఏఎన్నార్ జీవిత చరిత్ర గుర్తు చేస్తూ నటీనటులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Updated on: Oct 20, 2024 | 5:53 PM

ఎన్ని పనులయినా ఉండని... సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే సీరియల్ పండుగ రాత్రి 10 గంటల వరకూ నిరాటంకం గా జరిగిపోతూనే ఉంటుంది. అందునా... స్టార్ మా సీరియల్స్ కు ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంది. అభిమానులూ ఉన్నారు.

కార్తీక దీపం లో దీప ను తమ ఇంటి అమ్మాయిగా చూసుకున్నా... లేదంటే మరో సీరియల్ లో మరో క్యారెక్టర్ అయినా... మనసును తట్టి లేపే కథ, కథనాలతో ఆకట్టుకునేవి స్టార్ మా సీరియల్స్.

ఉత్తమ భర్త, భార్య, అత్త, నాన్న.. కనుమరుగవుతున్న బంధాల వేళ.. ఆ బంధాలలోని గొప్పతనం ను మరింత గొప్పగా చూపుతున్న ఈ సీరియల్స్ లోని నటులు, సాంకేతిక వర్గం కోసం ప్రతి ఏటా అందించే స్టార్ మా పరివార్ అవార్డ్స్ కార్యక్రమం ఈ రోజు స్టార్ మా టీవీ లో ప్రసారం కాబోతుంది.

సీరియస్ గా సీరియల్స్ లో కనిపించే నటీనటుల అసలైన క్యారెక్టర్ చూపుతూనే, పలు విభాగాలలో అవార్డ్స్ ను సైతం అందించనున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో పలువురు స్టార్ హీరోలు, ప్రముఖులు పాల్గొన్నారు.

అక్కినేని నాగేశ్వరావు శతజయంతి పురస్కరించుకొని టీవీ నటులు, అక్కినేని ని గుర్తు చేస్తూ చేసిన మెడ్లీ ఈ కార్యక్రమంలో హైలైట్ గా నిలువనుంది. ఇలాంటి వే మరెన్నో విశేషాలు కోసం ఈ ఆదివారం అంటే నేటి సాయంత్రం 6 గంటలకు స్టార్ మా టీవీ లో ప్రసారమయ్యే స్టార్ మా పరివార్ అవార్డ్స్ కార్యక్రమం చూసేయండి.




