Green India Challenge : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా సాగుతుంది. సామాన్యులు సెలబ్రిటీలు అందరు మొక్కలు నాటుతున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా సినీ ఆర్టిస్ట్ సనా మాదాపూర్ కాకతీయ పార్క్‌లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు నాటడం మన అందరి బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. కాలుష్యాన్ని తగ్గించి అందమైన పచ్చదనాన్ని పొందవచ్చని సనా తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా పర్యావరణ పరంగా మంచి మార్పును తీసుకువస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
sumanth akkineni : వాల్తేరు శీనుగా రానున్న అక్కినేని హీరో.. విశాఖపట్నం రౌడీగా కనిపించనున్న సుమంత్