Samantha: సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన పేరును మళ్లీ మార్చిన సమంత

|

Oct 03, 2021 | 11:02 AM

ప్రముఖ టాలీవుడ్ నటి సమంత తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పేరును ఇవాళ మళ్లీ మార్చారు. తన హ్యాండిల్ నేమ్ గా Samantha మెన్షన్ చేశారు.

Samantha: సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన పేరును మళ్లీ మార్చిన సమంత
Samantha New
Follow us on

Samantha social media handles: ప్రముఖ టాలీవుడ్ నటి సమంత తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పేరును ఇవాళ మళ్లీ మార్చారు. తన హ్యాండిల్ నేమ్ గా Samantha మెన్షన్ చేశారు. చైతో డైవర్స్ న్యూస్ వస్తున్న సమయంలో Samantha Akkineni తన సోషల్ మీడియా హ్యాండిల్‌ను మార్చి కేవలం S అన్న అక్షరం మాత్రమే పెట్టారు. ఇక నాగచైతన్యతో పెళ్లికి ముందు సమంత సోషల్ మీడియా హ్యాండిల్స్ లో సమంత రూత్ ప్రభు అని ఉండేది.

దాదాపు మూడేళ్లు సమంత అక్కినేనిగా ఇండస్ట్రీలో నిలిచిన ముద్దుగుమ్మ సమంత ఒక్కసారిగా మళ్లీ సమంత రూత్ ప్రభుగా, సమంతగా మారిపోయింది. టాలీవుడ్‌లోనే కాకుండా బయట కూడా చాలామంది చూసి అసూయపడే ఈ కపుల్‌ విడిపోతున్నారన్న వార్త ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వారినీ పర్సనల్‌గా చూడకపోయినా, కలవకపోయినా.. ఫ్యాన్స్ అందరికీ సమంత ఒక ఇన్స్‌పిరేషన్. అలాంటిది వారి విడాకులు తీసుకోవడం ఏంటి అనే ప్రశ్న అందరినీ ఇంకా వెంటాడుతూనే ఉంది.

ఏం మాయ చేశావే సినిమాతో.. సమంత – చైతు ఒకరి మాయలో ఒకరు పడిపోయారు. సుమారు 11 ఏళ్ల పాటు వీళ్ల ప్రేమకు.. నాలుగేళ్ల వివాహ బంధానికి ఊహించని విధంగా ముగింపు పడింది. మనం మూవీలో చైతు-సమంత పెయిర్‌ ఇప్పుడు రీళ్లు తిరుగుతోంది. వాళ్లిద్దరూ అలానే కలిసి వుండాలని అందరు కోరుకున్నారు. కానీ కలిసి వుండాలా.. విడిపోవాలా అని నిర్ణయించుకునే నిర్ణేతలు వాళ్లద్దరే. కారణాలేవైనా.. ఓ నిర్ణయం తీసుకున్నారు. స్వాగతించమని హుందగా రిక్వెస్ట్‌ చేశారు. ఐతే బంధాన్ని నిలపెట్టుకునేందుకు ప్రయత్నాలు జరిగాయా అన్న ప్రశ్నలూ ఇప్పుడు తలెత్తుతున్నాయి.

చైతు, సమంత ఇద్దరూ తమ చేతిపై ఒకేలా ఓ టాటూ ఉండేది. దానర్ధం.. రియలిస్టిగ్‌ ఉండాలి. మనసుకు నచ్చినట్టుగా బతకాలనేది టాటూ మీనింగ్‌ . ఆ విషయాన్ని ఇద్దరూ ఎంతో ఆనందంగా చెప్పారు కూడా. మరి చేతిలో చెయ్యేసి చెప్పిన బాసలు ఎందుకు మారాయి? మారడానికి కారణాలేంటి? పరిస్థితులేంటి? అనే ఊహాగానాలు అక్కినేని అభిమానుల్ని ఇంకా వెంటాడుతున్నాయి.

 

Read also: Badvel By Poll Boycott: కడప జిల్లా బద్వేల్ బై ఎలక్షన్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన ప్రజలు