Saanve Megghana: ఈ కర్లీ హీరోయిన్ తమ్ముడు కూడా టాలీవుడ్ లో క్రేజీ హీరో.. ఎవరో తెలిస్తే అవాక్కవుతారు

శాన్వీ మేఘన.. కర్లీ హెయిర్ తో క్యూట్ గా కనిపించే ఈ అమ్మడి గురించి తెలుగు ఆడియెన్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినా తన క్యూట్ యాక్టింగ్ అండ్ ఎక్స్ ప్రెషన్స్ తో యూత్ కు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయిందీ అందాల తార.

Saanve Megghana: ఈ కర్లీ హీరోయిన్ తమ్ముడు కూడా టాలీవుడ్ లో క్రేజీ హీరో.. ఎవరో తెలిస్తే అవాక్కవుతారు
Saanve Megghana

Updated on: Dec 28, 2025 | 6:14 PM

తెలంగాణ ప్రాంతానికి చెందిన శాన్వి మేఘన చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో ఆమె ఓ చిన్న పాత్రలో తళుక్కుమంది. ఆ తర్వాత 2019 లోనే బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పిట్ట కథలు, పుష్పక విమానం, ప్రేమ విమానం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్, టుక్ టుక్, కుడుంబస్థాన్ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయింది. తన క్యూట్ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో యూత్ కు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో శాన్వీకి ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తను షేర్ చేసే ఫొటోలు,వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. అన్నట్లు శాన్వీ తమ్ముడు కూడా టాలీవుడ్ లో క్రేజీ హీరో అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇటీవలే అతను నటించిన మొదటి సినిమా రిలీజై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో శాన్వీ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే వంశీ పూజిత్.

 

ఇవి కూడా చదవండి

ఇటీవల క్రిస్మస్ కానుకగా పతంగ్ అనే సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. చిన్న సినిమా ట్యాగ్ తో ప్రేక్షకుల ముందుక వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. హైదరాబాద్ సంస్కృతి, గాలి పటాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో నటించింది అందరూ కొత్త వాళ్లే.అందులో వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఇక వంశీ విషయానికి వస్తే.. MBA పూర్తిచేసి సినిమాల్లోకి వచ్చాడు. గతంలో బ్లాక్ కాఫీ అనే ఒక షార్ట్ ఫిలిం లో నటించి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. తన ప్రతిభకు ప్రతీకగా అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్పుడు పతంగ్ సినిమాతో హీరోగానూ సక్సెస్ కొట్టాడు.

పతంగ్ సినిమా హీరోతో శాన్వి మేఘన

ఓ పక్క అక్క శాన్వి మేఘన టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆమె తమ్ముడు వంశీ కూడా హీరోగా అదరగొట్టాడు.. మొత్తానికి ఈ అక్కాతమ్ముళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.