
పార్టీలు, పబ్బులు, ఫంక్షన్లు, ఈవెంట్స్.. ఇలా సందర్భమేదైనా జై బాలయ్య స్లోగన్ వినిపిస్తుంటుంది. ఇక వేరే హీరోల సినిమాలు ఆడుతున్నా సరే థియేటర్లలో కూడా ఈ స్లోగన్ వినపడాల్సిందే. అంతలా అభిమానులకు కనెక్ట్ అయిపోయిందీ జై బాలయ్య స్లోగన్. స్టార్ హీరోలు, హీరోయిన్ల నోటి వెంట కూడా ఈ డైలాగ్ వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇదే జై బాలయ్య స్లోగన్ తో థియేటర్ దగ్గర రచ్చ చేసింది ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్, ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్. ప్రస్తుతం సహాయక నటిగా వరుస సినిమాలు చేస్తోన్న ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో తలకు జై బాలయ్య బ్యాండ్ కట్టుకుని ఓ థియేటర్ బయట నిలబడి హంగామా చేస్తూ కనిపించింది. దీంతో ఈ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ గా మారాయి. ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఈ ఫొటోలను తెగ వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం రాధిక వరుస సినిమాలు చేస్తోంది. ఇందులో భాగంగా టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న కామ్రేడ్ కల్యాణ్ అనే మూవీలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తోందీ సీనియర్ నటి. ఇందులో ఆమె బాలకృష్ణ ఫ్యాన్ గా కనిపించనుంది. ఈ ఫొటోలు కూడా ఆ సినిమా షూటింగ్ లో తీసినవేనని తెలుస్తోంది. రాధిక షేర్ చేసిన ఫొటోలు చూస్తుంటే . కామ్రేడ్ కల్యాణ్ ఒక పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ ఫొటోస్ బ్యాక్ గ్రౌండ్ లో బాలకృష్ణ టాప్ హీరో మూవీ పోస్టర్ కూడా కనిపిస్తోంది. అంటే ఇది 1994 కథతో తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. ముఖ్యంగా బాలయ్య అభిమానులు వీటిని చూసి మురిసిపోతున్నారు.
A story I believed in.
A film I’m proud to present.#ThaaiKizhavi — https://t.co/ewdDBtXOevIntroducing @Dir_SivakumarM.@realradikaa Ma’am in a never-before-seen role.
A fun ride awaits you in theatres worldwide from 20 February, 2026 😊👍@KalaiArasu_ @Sudhans2017… pic.twitter.com/IOINaiJZzc
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) December 24, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.