
2010లో ఏం పిల్లో ఏం పిల్లడో అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ప్రణీత. ఆ తర్వాత సిద్ధార్థ్ తో కలిసి బావ అనే సినిమాలో యాక్ట్ చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి సూపర్ హిట్ మూవీ అత్తారింటికి దారేదిలో నటించింది. ఈ సినిమాలో ప్రణీత యాక్టింగ్ కు, ఎక్స్ ప్రెషన్స్ కు టాలీవుడ్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. వీటి తర్వాత ఎన్టీఆర్ తో భరోసా, మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం, పాండవులు పాండవులు తుమ్మెద, డైనమెట్, హలో గురు ప్రేమకోసమే తదితర చిత్రాల్లో నటించింది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లిపీటలెక్కిందీ అందాల తార. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతో కలిసి 2021 మే 30న పెళ్లిపీటలెక్కింది ప్రణీత. తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పెళ్లయ్యాక సినిమాలు బాగా తగ్గించేసింది ప్రణీత. అదే సమయంలో కేన్స్ లాంటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్లు, ఫంక్షన్లలోనూ సందడి చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.
తాజాగా ప్రణీత తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. బుధవారం (జులై 16) భర్త, పిల్లలతో కలిసి ఏడుకొండల వాడికి మొక్కులు చెల్లించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కాగా తన తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకుంది ప్రణీత. ‘ గోవిందా గోవిందా.. నా కుమారుడు కృష్ణ మొదటిసారి స్వామివారికి తలనీలాలు సమర్పించాడు’ అని తన పోస్టుకు క్రేజీ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Actress @pranitasubhash along with her family visited Tirumala to seek the divine blessings of Lord Venkateshwara!🙏✨#Pranita #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/9awUYQJtGk
— Telugu FilmNagar (@telugufilmnagar) July 16, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి