Tollywood: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్.. అమ్మాయి ఎవరో తెలుసా?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. శుభ ముహూర్తాలు కావడంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా పెళ్లిపీటలెక్కుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ కు చెందిన ఒక క్రేజీ హీరో కూడా వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.

Tollywood: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్.. అమ్మాయి ఎవరో తెలుసా?
Viswant Duddumpudi

Updated on: Aug 15, 2025 | 3:09 PM

ఇటీవ‌ల టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే ‘కేరింత’ ఫేమ్, టాలీవుడ్ యంగ్ హీరో విశ్వంత్‌ దుద్దుంపూడి తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ భావన అనే అమ్మాయితో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. గతేడాది ఆగస్టులో తో నిశ్చితార్థం చేసుకున్నాడు విశ్వంత్. ఈ ఏడాది సరిగ్గా ప్రేమికుల దినోత్సవం రోజునే అంటే ఫిబ్రవరి 14న ఇద్దరూ కలిసి పెళ్లిపీటలెక్కారు. అయితే నిన్నటివరకు పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచాడు విశ్వంత్. ఇప్పుడు తన పెళ్లయి ఆరు నెలలు అవుతుండడంతో పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘భావన & విశ్వంత్‌.. ఇద్దరూ ఒకరినొకరు చూసుకునే చూపులోనే ఓ రకమైన ప్రశాంతత.. నువ్వు నాకెప్పటినుంచో తెలుసన్న భావన.. ఇద్దరి చిరునవ్వులు, మనసులు సహజంగానే కలిసిపోయాయి’ అని ఈ ఫొటోలకు ఒక క్రేజీ క్యాప్షన్‌ ఇచ్చాడు. దీంతో ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు విశ్వంత్- భావన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోట లో పుట్టి పెరిగిన విశ్వంత్ కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అదే సమయంలో దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కిన ‘కేరింత’ సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. దీంతో ఉన్నత చదువులు మధ్యలోనే వదిలేసి ఇండియాకు వచ్చేశాడు. మొదటి సినిమా కేరింతతోనే మంచి ఈజ్ ఉన్న నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో ఈ యంగ్ హీరోకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.
ఓ వైపు హీరోగా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించాడు. జెర్సీ, ఓ పిట్ట కథ, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్, కథ వెనక కథ, తోలుబొమ్మలాట, ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా, మ్యాచ్ ఫిక్సింగ్, హైడ్ అండ్ సీక్ తదితర చిత్రాల్లో నటించాడు విశ్వంత్. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలోనూ ఓ కీలక పాత్ర పోషించాడు.

విశ్వంత్ వెడ్డింగ్ ఫొటోస్..

విశ్వంత్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.