అది మీ సమస్య మీరే చూసుకోండి..! అజిత్ ఇలా చేస్తాడని అనుకోలేదు.. అందరూ షాక్

ఇప్పుడున్న హీరోలందరిలో అజిత్ ప్రత్యేకం. తమిళ సినీ పరిశ్రమలో అగ్రకథానాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ సికింద్రాబాద్ కుర్రాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సవాళ్లు.. అడ్డంకులు.. అవమానాలను ఎదుర్కోని స్టార్ హీరోగా ఎదిగాడు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అజిత్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది.

అది మీ సమస్య మీరే చూసుకోండి..! అజిత్ ఇలా చేస్తాడని అనుకోలేదు.. అందరూ షాక్
Ajith

Updated on: Jan 31, 2026 | 12:05 PM

స్టార్ హీరో అజిత్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంలో ఇప్పటివరకు దాదాపు 63 చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ముందు విడుదలైన విడాముయార్చి సైతం మెప్పించింది. ఇటు సినిమాల్లో నటిస్తూనే అటు తనకు ఇష్టమైన కార్ రేసింగ్‌లో పాల్గొంటున్నాడు అజిత్. కేవలం హీరోగానే కాదు మానవత్వంతోనూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. టాలీవుడ్ నటుడు సమీర్ ఇటీవల అజిత్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

అన్నం బదులు అందం తింటుందా..!! సీరియల్‌లో సైడ్ యాక్టర్.. కానీ సినిమా హీరోయిన్లు కూడా పనికిరారు.. 

అజిత్ గురించి చెప్తూ.. ఓ సంఘటన గురించి తెలిపారు సమీర్. ఒకసారి సినిమా యూనిట్‌లో పనిచేస్తున్న కొందరు సిబ్బంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారికి రోజువారీ ఆహారం, వాహనాలకు డీజిల్ ఖర్చుల నిమిత్తం కూడా డబ్బులు లేని దుస్థితి ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించమని కోరుతూ వాళ్లు హీరో అజిత్ కుమార్ వద్దకు వెళ్లారు. అయితే, అజిత్ కుమార్ వారి సమస్య విన్న తర్వాత, అది తన బాధ్యత కాదని, నిర్మాతను అడగండి అని చెప్పారట.. “నేనేం చేయగలను.? మీరు నిర్మాతతో మాట్లాడాలి. దయచేసి మీ సమస్యను మీరే చూసుకోండి,” అని ఆయన చెప్పినట్లు సమీర్ తెలిపాడు. అజిత్ అలా చెప్పడంతో అందరూ షాక్ అయ్యారట. అందరికీ సహాయం చేసే మనస్తత్వం ఉన్న అజిత్ కుమార్, ఈసారి ఎందుకు ఇలా మాట్లాడారేంటి అని అందరూ షాక్ అయ్యారట. నిరాశతో వారు అక్కడి నుండి వెళ్లిపోయారని సమీర్ రెడ్డి తెలిపింది.

గోడకేసి కొట్టి, కటింగ్ ప్లేయర్‌తో మంగళసూత్రం తెంచాడు.. సింగర్ కౌసల్య జీవితంలో ఇంత విషాదమా..

కొద్దిసేపటి తర్వాత, షూటింగ్ కోసం అజిత్ కుమార్ ను పిలవడానికి కో-డైరెక్టర్ ఆయన మేకప్ రూమ్‌కు వెళ్లగా, ఆయన అక్కడ లేరని తెలిసింది. ఆయన హోటల్‌కు వెళ్లిపోయినట్లు ప్రొడక్షన్ మేనేజర్‌లు చెప్పారట. వెంటనే అజిత్ కుమార్ కు ఫోన్ చేయగా.. యూనిట్ సభ్యులందరికీ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని, లేకపోతే షూటింగ్ కు రాను అని చెప్పాడట. వారి పెండింగ్ బకాయిలను వెంటనే క్లియర్ చేయండి. అవసరమైతే నేను చెల్లిస్తాను. ఆ తర్వాత నాకు సెటిల్ చేయండి. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు నేను షూటింగ్‌కు రాను అని అజిత్ కుమార్ చెప్పారట. ఈ విషయం యూనిట్ సభ్యులందరికీ తెలియగానే, వారిలో ఆనందం వెల్లివిరిసింది. చిత్ర యూనిట్ దగ్గర నిర్మాతను తక్కువ చేయకుండా.. ఆతర్వాత తెలివిగా చిత్రయూనిట్ సమస్యను పరిష్కరించారట అజిత్. ఈ విషయాలను నటుడు సమీర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

చూడటానికి పెద్ద అంకుల్.. కానీ నాతో అలా చేశాడు.. షాకింగ్ విషయం చెప్పిన యాంకర్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..