Hero Nitin: వెండి తెరపై హీరోగా అడుగు పెట్టి 19 ఏళ్ళు పూర్తి చేసుకున్న నితిన్.. ఎన్ని సినిమాలను వదులుకున్నాడో తెలుసా

|

Jun 26, 2021 | 9:42 PM

Hero Nitin : నితిన్ హీరోగా వెండి తెరపై అడుగు పెట్టి 19 ఏళ్ళు పూర్తి అయ్యింది. మొదటి సరిగా జయం సినిమా తో తెరం గ్రేటం చేశాడు నితిన్. ఈ 19 ఏళ్ల సినీ కెరీర్ లో రాజమౌళి, త్రివిక్రమ్, స్టార్ డైరెక్టర్స్ తో..

Hero Nitin: వెండి తెరపై హీరోగా అడుగు పెట్టి 19 ఏళ్ళు పూర్తి చేసుకున్న నితిన్.. ఎన్ని సినిమాలను వదులుకున్నాడో తెలుసా
Nitin
Follow us on

Hero Nitin : నితిన్ హీరోగా వెండి తెరపై అడుగు పెట్టి 19 ఏళ్ళు పూర్తి అయ్యింది. మొదటి సరిగా జయం సినిమా తో తెరం గ్రేటం చేశాడు నితిన్. ఈ 19 ఏళ్ల సినీ కెరీర్ లో రాజమౌళి, త్రివిక్రమ్, స్టార్ డైరెక్టర్స్ తో పాటు పూరి జగన్నాథ్, కృష్ణ వంశీ వంటి క్రియేటివ్ డైరెక్టర్స్ తోనూ.. యంగ్ దర్శకులతోనూ సినిమాలను చేశాడు.. వరస ప్లాప్స్ తో కెరీర్ అయిపోయింది అనే కామెంట్స్ వినిపించే సమయానికి మళ్ళీ సూపర్ హిట్ తో కమ్ బ్యాక్ అయ్యాడు నితిన్.

దిల్, సై , అ ఆ, శ్రీ ఆంజనేయం, వంటి డిఫరెంట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు. వరసగా 12 ప్లాప్ లతో ఇండస్ట్రీ లో ఇక నితిన్ పని అయ్యింది అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అప్పుడు ‘ఇష్క్’ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి సూపర్ హిట్స్ తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. నితిన్ కెరీర్ లో డేట్స్ అడ్జెస్ట్ కాలేదనో.. లేక కథలు నచ్చకో తెలియదు కొని సినిమాలను మిస్ చేసుకున్నాడు. వాటిల్లో కొన్ని సూపర్ హిట్స్ ఉన్నాయి. హీరోల కెరీర్ కు హెల్ప్ అయ్యాయి. కొన్ని ప్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే..
వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దిల్’ సినిమాకి సుకుమార్ కూడా పనిచేసాడు. ఆ చిత్రం షూటింగ్ తుది దశలో ఉండగా నితిన్ కు ‘ఆర్య’ కథ వినిపించాడు సుకుమార్. కానీ అప్పటికే నితిన్ వరుసగా 4 సినిమాలకు కమిట్ అవ్వడంతో చేయలేకపోయాడు. ఆ సినిమా అల్లు అర్జున్ చెంతకు చేరింది. ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. అయితే మళ్ళీ ఇప్పటివరకూ నితిన్, సుకుమార్ కాంబోలో సినిమా రాలేదు. ఇక ధన 51 సినిమా ముందుగా నితిన్ వద్దకే వెళ్ళింది. నితిన్ నో చెప్పడంతో సుమంత్ నటించాడు. సూర్య కిరణ్ డైరెక్ట్ చేసాడు
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా బంటీ ఔర్ బబ్లీ రీమేక్ మొదట నితిన్ వద్దకు వెళ్ళింది. కానీ తరుణ్ హీరోగా నటించాడు.
నితిన్ కు ఇష్క్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కుమార్.. ‘మనం’ కథని కూడా మొదట నితిన్ కే వినిపించాడు. కానీ ఈ కథ అక్కినేని ఫ్యామిలీ కరెక్ట్ అని నితిన్ భావించి.. నాగ చైతన్య, నాగార్జున లకు విక్రమ్ కుమార్ ను పరిచయం చేసాడు నితిన్.
నితిన్ తో ‘ఆటాడిస్తా’ అనే చిత్రాన్నీ తెరకెక్కించిన రవికుమార్ మళ్ళీ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ కథను నితిన్ కు వినిపించాడు. కానీ నితిన్ ఓకే చెప్పలేదు. శతమానం భవతి సినిమా మొదట ఈ కథకి సాయి తేజ్ హీరోగా ఎంపికయ్యాడు. అయితే అతనికంటే ముందుగానే ఈ కథ నితిన్ వద్దకు వెళ్ళింది. కానీ ఫైనల్ గా శర్వానంద్ చేయడం జరిగింది. రామ్ కు సూపర్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకూడా మొదట నితిన్ దగ్గరకు వెళ్ళింది. నీ ప్రొడక్షన్ వ్యవహారాల విషయంలో తేడా వచ్చి.. నితిన్ తప్పుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు కొన్ని బాలీవుడ్ సూపర్ సినిమాలు రీమేక్ కోసం నితిన్ వద్దకు వెళ్లగా నో చెప్పినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్. అయితే లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత నితిన్ చెక్ , రంగ్ దే సినిమాలు థియేటర్స్ లో సందడి చేశాయి. అయితే ప్రస్తుతం నితిన్ మరో మూవీ మాస్ట్రో సెట్స్ మీద ఉంది. ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ ‘అంధాధూన్’కు ఇది రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మిల్కిబ్యూటీ తమన్నా ఓ కీలక పాత్రను పోషిస్తుండగా.. నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

Also Read: ప్రపంచంలో ఏ పండుకు లేని ప్రత్యేకత దీని సొంతం.. కుళ్ళిన తర్వా త తినాలి.. లేదంటే అనారోగ్యమే