దివంగత నటుడు కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం.. ఏం జరిగిందంటే?

దివంగత నటుడు కోట శ్రీనివాస్‌రావు ఇంట మరో విషాదం. కోట శ్రీనివాస్‌రావు సతీమణి కోట రుక్మిణి అనారోగ్యంతో సోమవారం ఉదయం తెల్లవారు జామున కన్నుమూశారు. కోట శ్రీనివాసరావు ఉన్నప్పటి నుంచే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన మరణించిన నెల రోజులకే ఆయన భార్య కూడా తుదిశ్వాస విడిచారు..

దివంగత నటుడు కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం.. ఏం జరిగిందంటే?
Kota Srinivarasa Rao Wife Passed Away

Updated on: Aug 18, 2025 | 6:04 PM

ప్రముఖ నటుడు కోట శ్రీనివారసరావు ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. కోట శ్రీనివారసరావు మరణించి నెల రోజులు గడిచాయో లేదో ఆయన సతీమణి కోట రుక్మిణి కూడా ఈ లోకం విడిచివెళ్లారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని స్వగృహంలో ఈ రోజు (ఆగస్ట్ 18) ఉదయం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. దీంతో సిని పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా కోట శ్రీనివాస్‌రావు జులై 13న కన్నుమూసిన సంగతి తెలిసిందే.

నటుడు కోట శ్రీనివాసరావు బతికి ఉన్నప్పటి నుంచే రుక్మిణి వృద్యాప్య సమస్యలతో బాధపడుతున్నారు. చాలా కాలం నుంచే అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న రుక్మిణి ఈ రోజు తెల్లవారుజామున మరణించినట్లు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఆమె అంత్యక్రియలు కూడా హైదరాబాద్‌లో పూర్తయినట్లు సమాచారం. కోట శ్రీనివాసరావు, రుక్మిణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. అయితే 2010లో కుమారుడు ఆంజనేయ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అప్పటి నుంచి కోట శ్రీనివాసరావు దంపతులు ఎంతో కుంగిపోయారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు ఒకరి వెంట ఒకరుగా మరణించడంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

కోట రుక్మిణి మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరుగాంచిన కోట శ్రీనివాసరావు తనదైన రీతిలో ఎన్నో సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్‌గా, కమెడియన్‌గా, రాజకీయ నేతగా విభిన్న పాత్రలో నటించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో ఆయన సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.