Ironleg Sastri: నటుడిగా ఛాన్సులే కాదు పౌరోహిత్యానికి కూడా ఎవరూ పిలవలేదు.. చివరికి రిక్షాలో అనాథ శవంలా

|

Jan 14, 2023 | 9:55 AM

తాగుడుకు బానిస అవ్వడంతో చివరికి ఐరన్ లెగ్ శాస్త్రికి సినిమా అవకాశాలు కూడా రాకపోయాయి. దీంతో ఆయన అనేక ఆర్థిక ఇబ్బందులకు గురి అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Ironleg Sastri: నటుడిగా ఛాన్సులే కాదు పౌరోహిత్యానికి కూడా ఎవరూ పిలవలేదు.. చివరికి రిక్షాలో అనాథ శవంలా
Iron Leg Sastry
Follow us on

గునుపూడి విశ్వనాథశాస్త్రి.. ఈ నేమ్ ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. ఐరన్ లెగ్ శాస్త్రి అంటే మాత్రం తెలుగు ప్రజలు అందరూ గుర్తుపడతారు. తన టైమింగ్‌తో హాస్యం పండించి.. తెలుగు ప్రేక్షుకులను అలరించిన నటుడు ఈయన. దాదాపు 150 సినిమాల్లో భారీ ఆకారంతో నవ్వించే పాత్రల్లో నటించి.. ప్రజల మన్ననలు పొందారు. లెజండరీ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తీసిన.. అప్పుల అప్పారావు మూవీతో నటుడిగా పరిచయమయ్యారు ఐరన్ లెగ్ శాస్త్రి. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో.. ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. పేకాట పాపారావు, ప్రేమఖైదీ, ఆవిడ మా ఆవిడ వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ఎక్కవగా బ్రహ్మనందం అసిస్టెంట్‌గా నటించి నవ్వులు పూయించేవారు ఐరెన్ లెగ్ శాస్త్రి. వీరి కాంబినేషన్‌కు అప్పట్లో మంచి డిమాండ్ ఉండేది.

సినిమాల్లో మంచి పేరు రావడంతో తన వృత్తి పౌరోహిత్యాన్ని వదిలేశారు ఐరన్ లెగ్ శాస్త్రి. బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే ఆయన మద్యానికి బానిసయ్యారు.  దీంతో క్రమంగా సినిమా అవకాశాలు తగ్గాయి. ఆపై ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. దీంతో తన పాత వృత్తి పౌరోహిత్యం వైపు తిరిగి వెళ్లాలి అనుకున్నారు. కానీ సినిమాల ద్వారా ఐరన్ లెగ్ అని పేరు పడటంతో.. ఆ ప్రభావం వ్యక్తిగత జీవితంపై కూడా పడింది. ఏవైనా కార్యాలు ఉన్నా కూడా ఆయన్ను పిలిచేవారు కాదు. అంతేకాదు మూవీ ఇండస్ట్రీలో జరిగే శుభకార్యాలకు సైతం ఆయన్ను ఎడం పెట్టేవారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు కమ్ముకొచ్చాయి.

ఒకానొక సమయంలో తన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన ప్రజలను మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశారు. దీంతో  ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు ఆర్థిక సాయం చేసినా..   పూర్తిగా కష్టాల నుంచి బయట పడే మార్గం దొరకలేదు. ఆరోగ్యం పాడవ్వడంతో సొంతూరు  తాడేపల్లిగూడెం వెళ్లిపోయారు. చివరికి శరీరం భారీగా పెరిగిపోయింది. పచ్చకామెర్ల వ్యాధితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే 2006 జూన్ 19న తాడేపల్లిగూడెంలో గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో భార్యాబిడ్డలు హైదరాబాద్ ఉన్నారట. వారు వచ్చి చూడగా.. ఐరన్ లెగ్ శాస్త్రి దేహాన్ని ఓ రిక్షాలో పడేసి ఉంచారట. దీంతో ఆయన భార్య కళ్లు తిరిగి పడిపోయారు. ఆ సమయంలో తన తండ్రి డెడ్ ‌బాడీ సగమే రిక్షాలో ఉందని, కాళ్లు చేతులు రిక్షా బయటికి వేలాడుతూ ఉన్నాయని, ఆ దుర్భుర పరిస్థితుల్లో ఆయన్ను రిక్షాల్లో తీసుకెళ్లడం చూసి తన తల్లి తల్లడిల్లిపోయిందని ఐరన్ లెగ్ శాస్త్రి తనయుడు ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..