ఇప్పటికీ తరగని అందం వీరి సొంతం.. 90 లో నటించిన ఈ హీరోయిన్లలో ఎంత మందిని గుర్తు పట్టగలరు ట్రై చేయండి..

80 వ దశకానికి చెందిన నటీనటులు ఏడాదికి ఒకసారి ఎక్కడైనా కలుస్తారు. చిన్న పిల్లల్లా మారి తెగ హంగామా చేస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయాన్ని 1990కి చెందిన నటీనటులు, దర్శకులు కొనసాగిస్తూ.. ఇటీవల గోవా వేదికగా కలుసుకున్నారు. అయితే ఈ పార్టీకి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్లు టాలీవుడ్లో అనేక సినిమాల్లో నటించారు. వీరిలో మీరు ఎంతమందిని గుర్తు పట్టగలరో ట్రై చేయండి.

ఇప్పటికీ తరగని అందం వీరి సొంతం.. 90 లో నటించిన ఈ హీరోయిన్లలో ఎంత మందిని గుర్తు పట్టగలరు ట్రై చేయండి..
90s Stars, Timeless Bonds

Updated on: Aug 01, 2025 | 4:13 PM

దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో తమకంటూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న చిత్రనిర్మాతలు, నటీనటులు గోవా వేదికగా కలుసుకున్నారు. 1990 లో వెండి తెరపై మెరిసిన హీరోయిన్లు, హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కలిసి ఎంజాయ్ చేశారు. ఆ బృందం బీచ్ లో సమావేశం అయ్యారు. తమ సినిమా అనుభవాలను మాత్రమే కాదు వివిధ కార్యకలాపాల గురించి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రీయూనియన్ సిని పరిశ్రమలో ప్రముఖుల స్నేహాల కొనసాగింపుగా అభివర్ణిస్తున్నారు. ఈ జాయ్‌ఫుల్ సెలబ్రేషన్స్, సెలెబ్రిటీల సందడికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలలో ఒకటి అందరినీ ఆకర్షిస్తోంది. అందులో అప్పటి అందమైన హీరోయినలు ఉన్నారు. మీరు ఆ ఫోటోలో ఉన్న హీరోయిన్లలో ఎంత మందిని గుర్తు పట్టగలరో ప్రయత్నించండి.

గోవాలో రీ యూనియన్ లో ఒకే చోటకి చేరి సందడి చేసిన హీరో యిన్లలో ఈ ఫోటోలో ఉన్నవారు సిమ్రాన్, మీనా, సంఘవి, మాళవిక, మహేశ్వరి, సంగీత, ఊహ( శివరంజని), రీమాసేన్ లు ఉన్నారు. వీరితో పాటు జగపతి బాబు, శ్రీకాంత్ లు, దర్శకులు కె.ఎస్. రవికుమార్, శంకర్, లింగుస్వామి, మోహన్ రాజా, కొరియోగ్రాఫర్-దర్శకుడు-నటుడు ప్రభుదేవా వంటివారున్నారు.

ఈ పునఃకలయికలో సముద్ర తీరంలో సమావేశం అయ్యారు. సరదాగా పడవ మీద ప్రయాణించారు. అందరూ కలిసి భోజనం చేశారు. ఈ సమయంలో సినీ పరిశ్రమలో తాము గడిపిన సమయాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన తారలను మళ్ళీ కలిసి చూడటం అభిమానులలో ఉత్సాహాన్ని కలిగించాయి. ఈ పునఃకలయిక తారలు,వారి అభిమానులిద్దరికీ ఒక స్వీట్ మెమరీ లాంటిది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..