Ajay Bhupathi: ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. మంగళవారం అనే టైటిల్‌తో..
లవ్ స్టోరీలో సరికొత్త కథనంతో ఈ సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించాడు. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్ గా నిలిచింది.

తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి. ఆర్జీవీ శిష్యుడిగా పరిచయమైనా అజయ్ తొలి సినిమా ఆర్ ఎక్స్ 100తోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు. లవ్ స్టోరీలో సరికొత్త కథనంతో ఈ సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించాడు. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలో పాయల్ అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా తర్వాత శర్వానంద్, సిద్దార్థ్ తో కలిసి మహా సముద్రం అనే సినిమా చేశాడు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమా దారుణంగా నిరాశపరచడంతో కాస్త గ్యాప్ తీసుకున్న అజయ్ భూపతి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో మరోసారి పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మంగళవారం అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేశారు. ఇక ఈ సినిమా హారర్ నేపథ్యంలో ఉండనుందని తెలుస్తోంది. స్వాతి – సురేశ్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రానుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించనున్నారు.
Here’s the Title & Concept Poster of our #Mangalavaaram #Chevvaikizhamai #Chovvazhcha ?
It’s a PAN-SOUTH INDIAN movie?
‘KANTARA’ fame @AJANEESHB is scoring ? to this never-seen-before film ?@MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/VqMNy64wYj
— Ajay Bhupathi (@DirAjayBhupathi) February 28, 2023
