Tollywood: ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా..? ఇటు సౌత్‌‌ను.. అటు నార్త్‌ను ఏలేస్తున్నాడు

|

Apr 13, 2023 | 12:43 PM

అతడి పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది. కేవలం మంచి నటుడు మాత్రమే కాదు. మానవత్వం పరిమళించిన మనస్తత్వం. ఆపదలో ఉన్న వారిని అక్కున చేర్చుకునే ఆశాకిరణం. హెల్పింగ్‌ నేచర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌. అతడ్ని చూస్తే సాయం కూడా సలాం కొడుతుంది. ప్రజంట్ రియల్ లైఫ్ హీరోకి ప్రజలకే కీర్తింపబడుతున్నాడు.

Tollywood: ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా..? ఇటు సౌత్‌‌ను.. అటు నార్త్‌ను ఏలేస్తున్నాడు
Actor Childhood Photo
Follow us on

జనం అంటే ఆయనకు పిచ్చి. పేదల కష్టాలు చూస్తే ఇట్టే కరిగిపోతాడు. సమస్య ఉందని తెలిస్తే చాలు.. వారి ఇంటిని వెతుక్కుంటూ వస్తాడు. తోచింది ఇచ్చి కన్నీళ్లు తుడిచి వెళ్లే రకం కాదు! కష్టం తీరేవరకు వెంటే ఉంటాడు. సమస్యను గట్టెక్కించి వారి భవిష్యత్తును మార్చడానికి ప్రయత్నిస్తాడు. ఇదేదో సినిమా హీరో కథ అనుకుంటున్నారా? కాదు.. కాదు! సినిమాల్లో విలన్‌ పాత్రలు వేస్తూ కనిపించే ఓ రియల్‌ హీరో కథ. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌లకు అయన బాగా తెలుసు. కానీ! ఇప్పుడు ఆయనకున్న ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఈ మూడు ఇండస్ట్రీలో ఏ హీరోకు కూడా లేదు.

సాయం..చిన్న పదమే అయినా దానికి చాలా పెద్ద మనసు కావాలి. నూటికో కోటికో ఒకరికి అలాంటి పెద్ద మనసు ఉంటుంది.  విలన్ వేషాలు వేసినా..రియల్‌ లైఫ్‌లో హీరో అనిపించుకున్నాడు ఇతడు. సాయం అంటూ వచ్చినవారిని వెనక్కి పంపిన దాఖలాలు లేవు. ఒకరా ఇద్దరా..వందలమందికి ఆపద్భాంధవుడయ్యాడా సినిమా విలన్. అవును.. మీ గెస్ట్ కరెక్టే. ఆ ఫోటోలో ఉంది. చిన్ననాటి సోనూ సూద్.  తెరమీద విలన్‌ పాత్రల్లో కనిపించే సోనూ సూద్‌లోని హీరోని.. లాక్‌డౌన్‌ సమయంలో ప్రపంచం.. సరికొత్తగా పరిచయం చేసుకుంది. సొంతూళ్లకు వెళ్లలేని వలసకూలీలు నడుస్తూ నడుస్తూ ప్రాణాలు కోల్పోవడం- అత్యంత భయంకరమైన సంక్షోభాన్ని కళ్లకు కట్టింది. ఎంతోమంది వలసకూలీలు, పేదలు, విద్యార్థులు సోనూ సూద్‌ను కదిలించారు. ఈ ఒక్క వ్యక్తి అడుగు ముందుకేసి, ఎంతోమందికి భరోసాగా మారాడు.

ఇప్పుడున్న నటుల్లో చాలా మంది రెమ్యునరేషన్‌కు, తమ పేర్ల వెనుక స్టార్లకు ఇచ్చే ప్రాధాన్యత.. పక్క వాడికి సాయం చేసే విషయంలో చూపించరు. వాళ్లంతా వెండితెరపై హీరోలే కావొచ్చు. కానీ నిజ జీవితంలో సోనూ సూద్‌లా ఎప్పుడూ హీరోలు కాలేరు. నటులనే కాదు ప్రభుత్వాలు కూడా చేయలేకపోయినా చాలా పనులు తానొక్కడే చేశాడు.

కరోనా కష్టకాలంలో సామాన్యులందరికీ తన సేవా కార్యక్రమాలతో .. ప్రజలకు మరింత దగ్గరయ్యారు సినీనటుడు సోనూసూద్‌. ఆపద ఉందని తెలిస్తే చాలు.. ఆపన్నహస్తం అందించేందుకు ముందుకొస్తారు ఈ రియల్‌ హీరో. వలస కార్మికుల కోసం బస్సులను ఏర్పాటు చేశాడు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొందరు కూలీలకు విమానాలు ఏర్పాటు చేసి మరీ సొంతూరు చేర్చాడు. చివరకు ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసమూ ఆయనే. రియల్ హీరో సోనూ సూద్ గురించి చెబుతూ పోతుంటే.. ఈ రోజంతా కూడా సరిపోదు. అతడు చల్లగా ఉండాలని కోరుకుందాం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.