Actor: ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

సాధారణంగా ఒక సినిమా హిట్ కాగానే కొంత మంది స్టార్స్ లా ఫీలవుతారు. సెలబ్రిటీలమంటూ ఆకాశంలో తేలిపోతుంటారు. కానీ ఈ నటుడు మాత్రం అలా కాదు. బ్లాక్ బస్టర్ సినిమా పడినా తన మనసుకు నచ్చిందే చేశాడు. తనకు ఇష్టమైన రంగంలోనే రాణిస్తున్నాడు.

Actor: ఈ నటుడు మల్టీ ట్యాలెంటెడ్.. విమానాలు నడుపుతాడు.. డెంటిస్ట్ కూడా..ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Bollywood Actor

Updated on: Jun 17, 2026 | 7:05 PM

2007లో హిందీలో వచ్చిన తారే జమీన్ పర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. పిల్లల పెంపకం, చదువు, తల్లిదండ్రుల పాత్ర వంటి సున్నితమైన అంశాలను ఎంతో హృద్యంగా చూపించారీ సినిమాలో. అలాగే విద్యా వ్యవస్థలోని లోపాలు .. లెర్నింగ్ డిజేబిలిటీస్ ఉన్న పిల్లల విష‌యంలో సమాజం ప్రదర్శించాల్సిన బాధ్యత, ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యతలను ఈ సినిమా చక్కగా చూపించింది. సామాజిక అంశాలతో కూడిన ఈ సినిమా హిందీలో మాత్రమే రిలీజైనా ఆల్ ఓవర్ ఇండియా తెగ చూసేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఇందులో హీరోగా నటించాడు. అంతేకాదు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలను కూడా భుజానకెత్తుకున్నాడు. అయితే ఆమిర్ ఖాన్ ఉన్నా ఈ సినిమా కథ మొత్తం ఈషాన్ అవస్థి (దర్శీల్ సఫారీ) అనే పిల్లాడి చుట్టే తిరుగుతుంటుంది. సినిమాలో ఈ కుర్రాడి అభినయం అందరినీ ఆకట్టుకుంది. కన్నీళ్లు కూడా తెప్పించింది.

అయితే ఇదే తారే జమీన్ పర్ సినిమాలో ఈషాన్ అవస్థితో పాటు మరో పిల్లాడి పాత్ర కూడా ఉంటుంది. అదే యోహాన్ అవస్థి రోల్. ఈషాన్ అవస్థికి అన్నయ్య రోల్ లో అద్భుతంగా నటించిన ఆ కుర్రాడి పేరు సాచేత్ ఇంజనీర్. ఈషాన్ చదువులో వెనుకబడి తండ్రి కోపానికి గురవుతుంటే అతడికి పూర్తి భిన్నంగా యోహాన్ మాత్రం చదువులోనూ, ఆటల్లోనూ ఎప్పుడూ టాపర్‌గా నిలుస్తాడు. కానీ ఆ దర్పం దరి చేరనీయకుండా తమ్ముడి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని అతనిపై ఎంతో ప్రేమ, ఆప్యాయతను కురిపిస్తుంటాడు. ఇలా యోహాన్ పాత్ర కూడా సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.

అయితే తారే జమీన్ పర్ సినిమా ఘనవిజయం సాధించినా సాచేత్ ఇంజనీర్ సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. సినిమాల్లో కొనసాగే అవకాశమున్నా ఉన్నత చదువులు అభ్యసించాడు. ప్రస్తుతం అతను లండన్ లో డెంటిస్ట్ గా సేవలందిస్తున్నాడు. కాగా దంత వైద్యంతో పాటు, సాచెట్‌కు విమానయానం పట్ల కూడా అభిరుచి ఉంది. అందుకే తరచూ విమానాలు నడుపుతూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.

ఇవి కూడా చదవండి

 

Sachet Engineer

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us