Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. 45 కోట్లు పెట్టి తీస్తే రూ.60 వేల కలెక్షన్స్ రాలేదు.. నిర్మాతలను నిండా ముంచేసింది..

కంటెంట్ నచ్చితే చిన్న సినిమాలకు క్యూ కడుతున్నారు మూవీ లవర్స్. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి చిత్రం థియేటర్లలో దూసుకుపోతుంది. కానీ మీకు తెలుసా.. ? భారీ అంచనాల మధ్య రూపొందించిన ఓ సినిమా నిర్మాతలను నిండా ముంచేసింది.

Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. 45 కోట్లు పెట్టి తీస్తే రూ.60 వేల కలెక్షన్స్ రాలేదు.. నిర్మాతలను నిండా ముంచేసింది..
Cinema (14)

Updated on: Nov 25, 2025 | 6:50 PM

సినీరంగంలో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కథ బాగుంటే స్టార్స్ లేకపోయినా చిన్న సినిమాలు సంచలనం సృష్టిస్తున్నాయి. భారీ ప్రమోషన్స్.. హడావిడి లేకుండా విడుదలై జనాలను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా మాత్రం సినీరంగంలోనే అతిపెద్ద డిజాస్టర్. దాదాపు రూ. 45 కోట్లతో నిర్మిస్తే.. కేవలం రూ.60 వేలు కూడా రాలేదు.అదే ది లేడీ కిల్లర్. 2023లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం చవిచూసింది. ఈ సినిమా బడ్జెట్ 45 కోట్ల రూపాయలు. బాలీవుడ్ స్టార్ . అర్జున్ కపూర్ ని నమ్మి నిర్మాతలు అంత డబ్బు పెట్టుబడి పెట్టారని చెప్పవచ్చు. అయితే, నిర్మాతలు ఆశతో సినిమా తీశారు.

ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..

ఈ సినిమా మొదటి రోజు 38 వేల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్ కేవలం 60 వేలు మాత్రమే. అంటే, మొదటి రోజు తర్వాత ఈ సినిమా కేవలం 22 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. అర్జున్ కపూర్ కెరీర్‌లో ఇది ఎప్పటికీ మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ సినిమా వల్ల నిర్మాతలు 99.99 శాతం నష్టపోయారు. ఈ సినిమా మొదటి రోజు 293 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?

ఈ సినిమా తర్వాత అర్జున్ కపూర్ క్రేజ్ సైతం పడిపోయింది. అంతేకాదు.. అతడి పర్సనల్ లైఫ్ సైతం విమర్శలకు దారితీసింది. అర్జున్ బాలీవుడ్ నటి మలైకా అరోరాతో ప్రేమలో పడ్డాడు. వారు కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఇప్పుడు వారు విడిపోయారు. అర్జున్ కపూర్.. బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు. హీరోగా సక్సెస్ కాలేదు. కానీ మలైకాతో ప్రేమ, డేటింగ్ కారణంగా అతడిపై ఒకప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..