iBomma Ravi : ఐ బొమ్మ రవి న్యూ గెటప్ ఇదే.. పోలీసులు మధ్యలో నడుచుకుంటూ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ రాకెట్‌ ప్రధాన సూత్రధారి iBomma రవి కేసులో సైబర్ క్రైమ్ విచారణ మరింత వేగవంతమైంది. రెండవ దఫా పోలీస్ కస్టడీ లో అధికారులు మరోసారి కీలక అంశాలపై ప్రశ్నించారు. ఈ క్రమంలో రవికి చెందిన ఈ మెయిల్ అకౌంట్లను పోలీసులు పూర్తిగా రిట్రైవ్ చేయడంతో సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి.

iBomma Ravi : ఐ బొమ్మ రవి న్యూ గెటప్ ఇదే.. పోలీసులు మధ్యలో నడుచుకుంటూ..
Ibomma Ravi

Edited By: Rajitha Chanti

Updated on: Nov 29, 2025 | 7:42 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ రాకెట్‌ ప్రధాన సూత్రధారి iBomma రవి కేసులో సైబర్ క్రైమ్ విచారణ మరింత వేగవంతమైంది. రెండవ దఫా పోలీస్ కస్టడీ లో అధికారులు మరోసారి కీలక అంశాలపై ప్రశ్నించారు. ఈ క్రమంలో రవికి చెందిన ఈ మెయిల్ అకౌంట్లను పోలీసులు పూర్తిగా రిట్రైవ్ చేయడంతో సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. మెయిల్‌లో స్పామ్, హైడ్ ఫైళ్లలో దాచిపెట్టిన రహస్య డేటాను సాంకేతిక నిపుణులు పరిశీలిస్తుండగా, పైరసీ ఆపరేషన్లకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన క్లూస్ బయటపడుతున్నాయని సమాచారం.

రెండో దఫా విచారణ లో ‘ప్రహ్లాద్’ అనే వ్యక్తిపై గురించి పోలీసు లకు కీలక సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌ కార్డ్ సహా కొన్ని వ్యక్తిగత పత్రాలు ప్రహ్లాద అనే వ్యక్తి పేరు మీద రవి తీసుకున్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆ డాక్యుమెంట్స్ సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. ఈ వ్యక్తి ఐ బొమ్మ రవితో ఎలా కనెక్ట్ అయ్యాడు? ఏ పాత్ర పోషించాడు? అన్న దానిపై విచారణ మరింత ముమ్మరం అవుతోంది.

అదే సమయంలో, ఎన్జీల్ (NGEL) అనే ఆన్లైన్ సోర్స్ ద్వారా తాను కాంటాక్ట్ అయ్యానని రవి విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ లింకును రవి సైబర్ క్రైమ్ అధికారులకు చూపించిన వెంటనే, అది రివోక్ అయినట్లు గుర్తించారు. అంటే ఆన్‌లైన్‌ ట్రేస్‌ను వెంటనే తొలగించేలా సాంకేతిక మెకానిజం పనిచేసినట్లు నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ లింక్‌ మూలాలను, దానికి సంబంధించిన డిజిటల్ ట్రైల్‌ను పోలీసులు సైంటిఫిక్‌గా పరిశీలిస్తున్నారు.

రాబోయే రోజుల్లో అడ్వాన్స్ పైరసీ ఆపరేషన్లకు ఉపయోగించే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ఐపి మాస్కింగ్‌, డార్క్ రౌటింగ్‌, సర్వర్లను విదేశాల్లో హైడ్ చేసే పద్ధతులు వంటి అంశాల గురించి రవి పోలిసులకు వివరించినట్లు సమాచారం. ఈ క్రమంలో త్వరలోనే iBomma రవి ఉపయోగించిన IP మాస్క్ లింక్స్, వాటితో కనెక్ట్ అయిన విదేశీ సర్వర్లపై పోలీసులు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పైరసీ రాకెట్‌ను పూర్తిగా బట్టబయలు చేయడంలో ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి : Actress : ఇండస్ట్రీలో సంచలనం.. 20 ఏళ్లలో 3 పెళ్లిళ్లు.. 3 విడాకులు.. నెట్టింట హాట్ టాపిక్ ఈ హీరోయిన్..