AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో నాని సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.. కానీ నో చెప్పా.. షాకింగ్ విషయం చెప్పిన లేటెస్ట్ సెన్సేషన్

తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో నాని ఒకరు. పక్కింటి అబ్బాయిలా.. సహజ నటనతో అడియన్స్ హృదయాలు గెలుచుకున్నారు. నిజానికి తెలుగులో నానికి.. ఆయన సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. విభిన్న కంటెంట్ కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు.

హీరో నాని సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.. కానీ నో చెప్పా.. షాకింగ్ విషయం చెప్పిన లేటెస్ట్ సెన్సేషన్
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 29, 2026 | 6:44 PM

Share

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో శ్యామ్ సింగరాయ్ సినిమా ఒకటి. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ రోల్స్ లో నటించి మెప్పించారు. ముఖ్యంగా శ్యామ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు నాని. నాని సరసన సాయి పల్లవి, కృతిశెట్టి నటించారు. అలాగే మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియిన్ కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. కలకత్తా నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించి అలరించారు. దర్శకుడు రాహుల్ పునః జన్మ ల నేపథ్యంను చాలా చక్కగా చూపించాడు దర్శకుడు రాహుల్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నేను చేయాల్సింది మిస్ అయ్యిందని ఓ అందాల భామ చెప్పుకొచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్

ఆమె ఎవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్ ఫోక్ డాన్సర్ నాగ దుర్గ. ఫోక్ సాంగ్స్ తో పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. వందలకొద్దీ సాంగ్స్ చేసి పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. యూట్యూబ్ లో సెన్సేషన్ గా మారిన ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవలే ధనుష్ మేనల్లుడు నటించిన సినిమాలో హీరోయిన్ గా చేసింది. అలాగే ఇప్పుడు తెలుగులో ఇడుపు కాయితం అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే నాగ దుర్గ గతంలో చేసిన కామెట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తాం అంటున్నారు.. రోడ్డు మీద పట్టుకొని కొట్టారు..! కన్నీళ్లు పెట్టుకున్న నటుడు

గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగ దుర్గ మాట్లాడుతూ..  కొవిడ్‌ లాక్‌డౌన్‌లో చాలా సమయం దొరికింది. అప్పుడే, యూట్యూబ్‌ ట్రెండ్‌ మరీ ఎకువైంది. ఆ టైంలో డాన్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదాన్ని.. అంతకుముందు ఎన్నో పాటలకు డ్యాన్స్‌ చేశాను కానీ, ప్రొఫెషనల్‌గా చేసింది మాత్రం ‘తిన్నాతిరం పడతలే..’ పాటకే..ఆ పాటకు ఏకంగా వంద మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఆ సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. ఆ పాట తర్వాత చాలా మంది ఫోక్ సాంగ్స్ కు అలవాటు పడ్డారు. అలాగే ఆమె మాట్లాడుతూ.. నాని హీరోగా నటించిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో నటించే అవకాశం వచ్చింది. అలాగే విడుదలైన ‘అశోక వనంలో.. అర్జున కల్యాణం’ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం కూడా అడిగారు. నాకు నటన అంటే ఇష్టమే. కానీ.. నాట్యంలో డాక్టరేట్‌ సాధించాలనేది నా కల అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి :చిన్న సినిమా.. కట్ చేస్తే 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు..! ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us