
దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలి అని ఒక సామెత ఉంది. ఈ మాటను అక్షరాలా నిజం చేస్తున్నారు హీరోలు, హీరోయిన్లు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వ్యాపారాల్లోనూ అడుగు పెడుతున్నారు. హోటల్, రెస్టారెంట్, థియేటర్, జ్యూవెలరీ.. ఇలా ఎన్నో రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లో ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెనే కాదు టాలీవుడ్ హీరోలు మహేష్ బాబు, అక్కినేని నాగ చైతన్య, బాలీవుడ్ నటి జూహీ చావ్లా, రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సన్నీలియోన్, మౌనీరాయ్.. ఇలా ఫేమస్ హీరోయిన్లందరికీ రెస్టారెంట్స్ ఉన్నాయి. అయితే వీరందరిలో ఓ హీరోయిన్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు రెస్టారెంట్లు ఉన్నాయి. ఒక్కో రెస్టారెంట్ ద్వారా నెలకు రూ. 6 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ముంబైలోని రెస్టారెంట్స్ అన్నింటిలో అత్యధిక జీఎస్టీ కట్టే ఏకైక రెస్టారెంట్ ఈ ముద్దుగుమ్మదే. ఇలా బిజినెస్ వుమన్ గా కోట్లు గడిస్తోన్న ఆ బ్యూటీ మరెవరో కాదు శిల్పా శెట్టి.
40 ప్లస్ లోనూ కుర్ర హీరోయిన్లకు పోటినిచ్చే అందం శిల్పాశెట్టిది. అయతే గతంలో మాదిరగా ఆమె ఇప్పుడు సినిమాలు చేయట్లేదు. అడపా దడపా మాత్రమే సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తోంది. అయితే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిందీ అందాల తార. అందులో రెస్టారెంట్ బిజినెస్ ఒకటి. శిల్పా శెట్టికి ముంబైలోని బాంద్రాలో బాస్టియన్ పేరుతో ఒక రెస్టారెంట్ ఉంది. 2019 లో రంజిత్ బింద్రాతో ఆమె ఈ రెస్టారెంట్ బిజినెస్ మొదలుపెట్టింది. మొదట బాంద్రాలో మొదలైన ఈ రెస్టారెంట్ ఆ తర్వాత నగరంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. కేవలం ఈ ఈ రెస్టారెంట్ నుంచి శిల్పా శెట్టికి నెలకు రూ. 6 కోట్లు ఆదాయం వస్తుందట.
ముంబై లోని స్టార్ సెలబ్రిటీలు అందరూ ఎక్కువగా బాస్టియన్ రెస్టారెంట్స్ లోనే దర్శనమిస్తూ ఉంటారు. ఇలా ముంబై నగరంలో శిల్పా శెట్టికి ఇప్పటివరకు 6 రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కేవలం ముంబైలోనే కాకుండా పూణే, కలకత్తా, బెంగుళూరులో కూడా బాస్టియన్ రెస్టారెంట్స్ ను విస్తరించాలని శిల్పా శెట్టి ప్రణాళికలు రచిస్తోంది. అలాగే గోవాలో రెండు బ్రాంచ్ లు ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..