
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఈమధ్య కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని సాధించిన సినిమాల గురించి తెలుసా.. ? థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాలు ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రేక్షకుల ఎంపికను దృష్టిలో ఉంచుకుని, చిత్రనిర్మాతలు ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. నార్త్ నుంచి దక్షిణాది వరకు నిర్మాతలు అలాంటి చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఈ సంవత్సరం విడుదలైన ఒక సినిమా ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా దృశ్యం, విక్రమ్ వేద వంటి సినిమాలు గుర్తుకువస్తాయి. కానీ మలయాళంలో వచ్చిన ఓ చిన్న సినిమా ఈ రెండు సినిమాల కంటే ఎక్కువ ట్విస్టులు కలిగి ఉంది. ఇంతకీ అదెంటో తెలుసా.. ? అదే ఆఫీసర్ ఆన్ డ్యూటీ.
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో కుంచకో బోబన్, విశాక్ నాయర్, ప్రియమణి, మీనాక్షి అనుప్ ప్రధాన పాత్రలు పోషించారు. 20 ఫిబ్రవరి 2025న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఈ చిత్రానికి జిత్తు అషరీఫ్ దర్శకత్వం వహించారు. కేవలం రూ.12 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.55 కోట్లు వసూలు చేసింది. ఇది మలయాళంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఒకటి. ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథ ఇది.
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..
Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..
ఒక నకిలీ అభరణాల కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు నెమ్మదిగా క్రిమినల్ సిండికేట్ మాఫియా గురించి తెలుసుకుంటాడు. ఆద్యంతం ఆసక్తికరంగా.. క్షణక్షణం సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా సాగుతున్న ఈ సినిమా దాదాపు 2 గంటల 14 నిమిషాల నిడివితో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీ దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి :
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..
Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..
Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..
Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..