Timmarusu Movie: సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తిమ్మరుసు’. ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ సినిమాతో సత్యదేవ్ నటిస్తోన్న సినిమా కావడం, అందులోనూ సత్యదేవ్ ఇందులో లాయర్ పాత్రలో నటిస్తుండడంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నిజానికి ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా విడుదల చేస్తారని చాలా మంది భావించారు. కానీ ఆ ఊహాగానాలకు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ తాజాగా అధికారిక ప్రకటన చేసింది. ‘తిమ్మరుసు’ చిత్రాన్ని జులై 30న థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
ఈ విషయమై హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా చేసిన తర్వాత ఎలాంటి సినిమా చేయాలని అనుకుంటున్న సమయంలో ‘తిమ్మరుసు’ సినిమా కథ విన్నాను. ఈ కథ నాకు బాగా నచ్చింది. అందుకే వెంటనే ఓకే చెప్పాను. ప్రియాంక జువాల్కర్ వండర్‌ఫుల్ కోస్టార్. సినిమాను జులై 30న థియేటర్లలో విడుదల చేస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా నిర్మాత మహేశ్ కోనేరు మాట్లాడుతూ.. ఈ చిత్ర నిర్మాణాన్ని చాలా చాలెంజింగ్ పరిస్థితుల్లో చేపట్టామని, అందరి సహకారంతోనే సినిమాను పూర్తి చేశామని తెలిపారు. ఈ సినిమాలో సత్యదేవ్ లాయర్ పాత్రలో నటిస్తున్నారని చెప్పిన ఆయన.. సత్యదేవ్ లుక్, పాత్ర తీరు చాలా కొత్తగా ఉంటుందన్నారు. ఈ సినిమాలో ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ అంశాలతోపాటు మంచి సందేశం కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకు తిమ్మరుసు అనే టైటిల్ ఎందుకు పెట్టారన్న దానిపై చిత్ర దర్శకుడు శరత్ కొప్పి శెట్టి వివరిస్తూ.. ‘శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉండే తిమ్మరుసు చాలా తెలివైన వ్యక్తి. చక్కగా వ్యుహాలు చేయడమే కాదు.. మంచి నిజాయతీగల వ్యక్తి. అలాంటి ఇంటెలిజెంట్ అయిన లాయర్ పాత్రలో సత్యదేవ్‌గారు చేస్తున్న డిఫరెంట్ అటెంప్ట్’ అని చెప్పుకొచ్చారు. మరి వైవిధ్యమైన కథాంశంతో వస్తోన్న ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ జులై 30న సినిమా విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ.. అప్పట్లోగా థియేటర్లు తిరిగి ఓపెన్ అవుతాయా? అన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.