సాధారణంగా సెలబ్రెటీలతో పలు కంపెనీస్ ప్రకటనలు చేస్తుంటారు. తమ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా ఉండాలని కోరుకుంటారు. అయితే ఇప్పటికే చాలా మంది నటీనటులు, స్పోర్ట్స్ పర్సన్స్ పలు యాడ్స్ చేస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి అల్లు అర్జున్, విరాట్ కోహ్లీ, షారుఖ్ ఖాన్, యశ్ వంటి స్టార్స్ పలు బ్రాండ్లు ప్రమోట్ చేస్తూ యాడ్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ భారీ మొత్తంలో ఆఫర్స్ వచ్చినా కాదనుకున్నవారు ఉన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే పలు బ్రాండ్స్.. వ్యసనానికి దారితీసే ఉత్పత్తులకు యాడ్స్ చేయలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ స్టార్స్ సైతం కోట్లను కాదనుకున్నారు.
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఫెయిర్ నెస్ క్రీమ్ ప్రమోట్ చేయాలని భారీ మొత్తంలో ఆఫర్ వచ్చిందట. అయితే అభిమానులను మోసం చేయడం ఇష్టం లేదని ఆ ఆఫర్ కాదనుకుంది సాయిపల్లవి. అలాగే ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం పొగాకు కంపెనీకి సంబంధించిన యాడ్ చేసేందుకు నిరాకరించాడు. తన ఫ్యాన్స్ ప్రకటనను చూసి వ్యసనానికి దారితీసే ఉత్పత్తిని తినడం ఇష్టం లేదని తెలిపారు.
అలాగే ప్రబాస్ గతేడాది రూ. 150 కోట్లు విలువైన బ్రాండ్ యాడ్స్ కాదనుకున్నాడు. ఇండస్ట్రీలో తనకున్న స్థానం. అభిమానుల ఫాలోయింగ్ పట్ల ప్రభాస్ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. తమిళ్ స్టార్ హీరో శింబుకు ఓ బ్రాండ్ మద్యంకు యాడ్ చేయాలని భారీ మొత్తంలో ఆఫర్ వచ్చిందట. కానీ అందుకు శింబు నిరాకరించాడు. తన లేటేస్ట్ చిత్రం మానాడు విజయం తర్వాత వచ్చిన ఆల్కహల్ బ్రాండ్ ప్రమోట్ ఆఫర్ తిరస్కరించాడు. నందమూరి బాలకృష్ణ కూడా పలు బ్రాండ్స్ ప్రమోట్ చేసేందుకు ఇష్టపడలేదు. ఇప్పటివరకు ప్రింట్ లేదా టీవీ వాణిజ్య ప్రకటనలు చేయలేదు బాలయ్య. తెలుగు ప్రజలు తనపై ఎంతో ప్రేమ, అభిమానాన్ని చూపిస్తున్నారని.. కానీ వారి ప్రేమను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకోలేను అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు బాలయ్య. వారి ప్రేమతో డబ్బు సంపాదించలేనని.. ఒక నటుడిగా సినిమాల ద్వారా ప్రజలను అలరించడమే తనకు ముఖ్యమని.. జీవితాంతం నటుడిగానే ఉండిపోతానని తెలిపారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇప్పటివరకు ఎలాంటి బ్రాండ్లను ప్రమోట్ చేయలేదు. వాణిజ్య ప్రకటనలో నటించాలని ఎన్నోసార్లు ఆయనకు భారీ మొత్తంలో ఆఫర్స్ వచ్చినా పవన్ కాదనుకున్నారు. తన అభిమానులను అవాస్తమైన ఉత్పత్తుల గురించి తెలియజేయాలనుకోవడం లేదని తెల్చీ చెప్పారు పవన్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.