తెలుగులో ఆ మూడు సినిమాలను క‌రోనా క‌మ్మేసింది…

లాక్ డౌన్ ఎఫెక్ట్ సినిమా ఇండ‌స్ట్రీపై గ‌ట్టిగా ప‌డింది. లెక్క‌ల‌న్నీ తారుమారయ్యాయి. అన్నీంటికి సడ‌లింపులు ఇచ్చినా థియేట‌ర్స్ మూత‌ప‌డి 100 రోజులైనా ఓపెన్ అయ్యే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు.

తెలుగులో ఆ మూడు సినిమాలను క‌రోనా క‌మ్మేసింది...
Follow us

|

Updated on: Jun 25, 2020 | 8:11 PM

లాక్ డౌన్ ఎఫెక్ట్ సినిమా ఇండ‌స్ట్రీపై గ‌ట్టిగా ప‌డింది. లెక్క‌ల‌న్నీ తారుమారయ్యాయి. అన్నీంటికి సడ‌లింపులు ఇచ్చినా థియేట‌ర్స్ మూత‌ప‌డి 100 రోజులైనా ఓపెన్ అయ్యే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. దీంతో ఫైనాన్స‌ర్ల ద‌గ్గ‌ర డ‌బ్బులు తెచ్చిన నిర్మాత‌లు త‌ల‌లు పట్టుకుంటున్నారు. మ‌ధ్య‌లో ఆగిపోయిన కొన్ని సినిమాల ప‌రిస్థితి ఏంటో అర్థం కావ‌డం లేదు. ఒక‌టి, రెండు సినిమాల్ని ముందుగానే కొన్న బ‌య్య‌ర్లు కూడా థియేట‌ర్లు ఇప్ప‌ట్లో ఓపెన్ అయ్యే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో..నిర్మాత‌ల‌కు ఇచ్చిన డ‌బ్బులు కూడా వెన‌క్కి అడుగుతున్న‌ట్టు సమాచారం. క్రాక్, రెడ్, సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ సినిమాలు ఈ ప‌రిస్థితిని ఎదుర్కుంటున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ మూడు చిత్రాల థియేరిక‌ల్ రైట్స్ ముందుగానే అమ్ముడ‌య్యాయి. మంచి బ‌జ్ ఉండ‌టంతో బ‌య్య‌ర్లు ముందుగానే అడ్వాన్సులు ఇచ్చేశారు. సోలే బ్ర‌తుకే సో బెట‌ర్ 16 కోట్ల‌కు అమ్ముడ‌వ్వ‌గా, క్రాక్ అన్ని ఏరియాల్లో క‌లిపి 20 కోట్ల వ‌ర‌కూ రాబ‌ట్టింది. రెడ్ కూడా మంచి రేటుకే అమ్ముడైంది. కానీ ఇప్పుడు బ‌య్య‌ర్లు ప్లేటు పిరాయించ‌డంతో ఏం చేయాలో పాలు పోవ‌డం లేదు నిర్మాత‌లు. థియేట‌ర్లు ఓపెన్ చేస్తే జ‌నాలు వ‌స్తారో, రారో తెలియ‌దు..సీటింగ్ మార్చేస్తే ఆదాయం త‌గ్గిపోతుంది. అందుకే బ‌య్య‌ర్లు రిస్క్ చెయ్య‌డం లేదు. ఇవే కాదు చాలా సినిమాల ప‌రిస్థితి ఇలానే ఉంది. మ‌రి నిర్మాత‌లు ఈ చిక్కు ముళ్ల నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాలి.