
తెలుగు రాష్ట్రాల్లో ఫెస్టివల్ సీజన్ పైనే ఎన్నో అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా సినీ లవర్స్ ను ఆకట్టుకునేందుకు భారీ బడ్జె్ట్ చిత్రాలు.. స్టార్ హీరోస్ సినిమాలతో రంగంలోకి దిగుతుంటారు మేకర్స్. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు విడుదలవుతుంటాయి. ఈ సందర్భంగా భారీ బడ్జెట్ చిత్రాలు, చిన్న బడ్జెట్ చిత్రాలు విడుదలవుతున్నాయి. ముఖ్యంగా ఈసారి టాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోస్ మధ్య భారీ పోటీ నెలకొంది. 2024 సంక్రాంతికి ఇంకా మూడు నెలల సమయం ఉన్నందున, కొత్త సినిమాలు జనవరి 12 ,13కి రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు, రవితేజ వంటి స్టార్స్ తమ అప్ కమింగ్ సినిమాల రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయగా.. ఇప్పుడు వెంకీమామ సైతం ఈ జాబితాలోకి చేరిపోయారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న సైంధవ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. దీంతో సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలు ఏంటో తెలుసుకుందామా.
సైంధవ్: దగ్గుబాటి వెంకటేష్ సినిమాల కోసం తెలుగు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎన్నో హిట్ చిత్రాలతో అలరించిన వెంకీ.. ఇప్పుడు సైంధవ్ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన ‘సైంధవ’ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం 2024 జనవరి 13న విడుదల కానుంది. ఈ చిత్రానికి శైలేష్ దర్శకత్వం వహిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, రౌహానీ శర్మ తదితరులు ఈ చిత్రంలో నటించారు.
#SAINDHAV will see you at the cinemas from 13th JANUARY 2024 ❤️🔥
More Exciting Updates soon 💥#SaindhavOnJAN13th 🔥 pic.twitter.com/eJPuZJfJib
— Niharika Entertainment (@NiharikaEnt) October 5, 2023
గుంటూరు కారం: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. జనవరి 12న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమా టీజర్, పోస్టర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి.
నా సామిరంగా: ఇటీవల అక్కినేని నాగార్జున తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ‘నా సామి రంగ’ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో పాటు సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. కానీ తేదీ మాత్రం ప్రకటించలేదు. ఇందులో నాగార్జున మాస్ హీరో లుక్ లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, యశవిని తదితరులు నటించారు. సుబ్రహ్మణ్య పచ్చ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈగల్: బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తూ వరుసగా హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నారు మాస్ మాహారాజా రవితేజ. ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు టైగర్ నాగేశ్వర రావు సినిమాలో నటిస్తూనే.. ఇటీవల కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. అదే ఈగల్. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. సంక్రాంతికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఈ సందర్భంలో, రేసులో మరిన్ని సినిమాలు చేరే అవకాశం ఉంది. దీంతో ఈ సంక్రాంతికి స్టార్ హీరోస్ మధ్య పోటీ ఎక్కువగానే ఉండేలా కనిపిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.