
బూరెల బుట్టలో పడటం అంటే ఏంటో తెలుసా? మీలో ఏ ఒక్కరికి తెలియకపోయినా, మమ్మల్ని అడగండి… మేం చెబుతాం అని అంటున్నారు దుల్కర్, వరుణ్ తేజ్ అండ్ కార్తికేయ. ఇంతకీ ఈ ముగ్గురు హీరోలకు కంబైన్డ్ గా కలిసొచ్చిన పాయింట్ ఏంటి? అయితే తెలుసుకుందాం రండి.. భోళాశంకర్ వచ్చిందీ, పోయిందీ తెలియనట్టే మిగిలిపోయింది పరిస్థితి. సో, గత వారం సందడంతా పొరుగు సినిమాలదే కనిపించింది. సౌత్ నుంచి సూపర్‌స్టార్ రజనీకాంత్, నార్త్ నుంచి సన్నీడియోల్, అక్షయ్‌కుమార్ హంగామా మామూలుగా లేదు.
మొన్న శుక్రవారం సినిమాలు వచ్చిందీ తెలియలేదు. పోయిందీ తెలియలేదు. మిస్టర్ ప్రెగ్నెంట్, ప్రేమ్‌కుమార్ విడుదలైనా పెద్దగా జనాలను అట్రాక్ట్ చేయలేకపోయాయి. ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి వచ్చేవారం వచ్చేస్తున్నారు ఒకరికి ముగ్గురు హీరోలు. వారిలో మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ ఒకరు. గాండీవధారి అర్జున మూవీతో ఈనెల 25న జబర్దస్త్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఫిక్సయ్యారు వరుణ్.
వరుణ్ తేజ్ ఇన్ స్టా పోస్ట్..
ఆగస్టు 24న నేనూ వస్తున్నా అంటున్నారు దుల్కర్ సల్మాన్. దుల్కర్ నటించిన సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. అయితే, వాటిలో ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంటే ఉంటుంది. ఇప్పుడు మాత్రం పక్కా మాస్ లుక్‌లో కింగ్ ఆఫ్ కోత చేశారు దుల్కర్. మరి సీతారామమ్ తరహాలో ఈ సినిమా కూడా మెప్పిస్తుందా?
దుల్కర్ సల్మాన్ ఇన్ స్టా పోస్ట్..
ఆర్ ఎక్స్ 100 తర్వాత ఆ రేంజ్ హిట్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని వెయిట్ చేస్తున్నారు హీరో కార్తికేయ. ఆయన నటిస్తున్న బెదురులంక ఈ నెల 25న విడుదలకు రెడీ అవుతోంది. ఎన్నాళ్లుగానో వేచిన ఉదయాన్ని బెదురులంక తెచ్చిపెడుతుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది కార్తికేయలో.
కార్తికేయ ఇన్ స్టా పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.