Rashmika Mandanna: విషాదాంతమైన ఓ నటి బయోపిక్​లో రష్మిక! ఎవరా నటి? ఏం జరిగింది?

తక్కువ కాలంలోనే మంచి అవకాశాలు దక్కించుకుని తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో అనూహ్యమైన స్టార్‌డమ్‌ను చూసిన ఆ నటి కథ... ఒక విషాద కావ్యంగా ముగిసింది. అప్పటివరకు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన ఆమె, తన జీవితంలో ఎదుర్కొన్న అంతుచిక్కని సంఘర్షణలు, ఆకస్మిక మరణం ..

Rashmika Mandanna: విషాదాంతమైన ఓ నటి బయోపిక్​లో రష్మిక! ఎవరా నటి? ఏం జరిగింది?
Rashmika And Actress

Updated on: Dec 09, 2025 | 8:58 AM

తక్కువ కాలంలోనే మంచి అవకాశాలు దక్కించుకుని తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో అనూహ్యమైన స్టార్‌డమ్‌ను చూసిన ఆ నటి కథ… ఒక విషాద కావ్యంగా ముగిసింది. అప్పటివరకు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన ఆమె, తన జీవితంలో ఎదుర్కొన్న అంతుచిక్కని సంఘర్షణలు, ఆకస్మిక మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటి?

ఇప్పుడు, ఆమె హృదయ విదారక జీవిత ప్రయాణం వెండితెరపై ఆవిష్కృతం కాబోతోంది. ఈ సున్నితమైన, సవాలుతో కూడిన పాత్రలో అగ్ర కథానాయిక రష్మిక మందన్న నటించబోతోందనే వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఎవరి బయోపిక్​? రష్మిక ఒప్పుకుందా?

వీడని చిక్కుముడి..

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో కొద్ది కాలంలోనే తనదైన ముద్ర వేసిన నటి ప్రత్యూష. ఆమె విషాదభరితమైన ముగింపు సినీ పరిశ్రమనే కాకుండా, ప్రేక్షకులను కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె జీవితం, కెరీర్, ఆకస్మిక మరణం ఒక సినిమా కథకు సరిపోయేంత భావోద్వేగాలను, సస్పెన్స్‌ను కలిగి ఉన్నాయి. అందుకే ఆమె జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీయాలనే ఆలోచన ఇప్పుడు తెరపైకి వచ్చింది.

ఈ ముఖ్యమైన పాత్ర కోసం టాలీవుడ్‌లో ప్రస్తుతం అగ్ర కథానాయికగా ఉన్న రష్మిక మందన్న పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రత్యూష జీవితం కేవలం సినిమా విజయాలతో ముడిపడి లేదు. ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, ఆమె మరణం వెనుక ఉన్న మిస్టరీ ప్రేక్షకులకు ఇప్పటికీ ఆసక్తికరమైన అంశాలే. ఇలాంటి పాత్రను పోషించడం నటీమణులకు ఒక సవాలుతో కూడుకున్నది. ప్రత్యూష మరణం వెనకున్న కారణం ఇప్పటికీ వీడని చిక్కుముడిగానే ఉండిపోయింది.

Rashmika And Actress Pratyusha

రష్మికలో ప్రత్యూషకు దగ్గర పోలికలు, ముఖ్యంగా కళ్ళలో ఉండే అమాయకత్వం ఉన్నాయి. రష్మిక ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ, నటిగా తన పరిధిని విస్తరించుకుంటోంది. భావోద్వేగాలను అద్భుతంగా పలికించగల నైపుణ్యం ఆమెకు ఉంది.

రష్మిక ప్రస్తుతం ఉన్న స్టార్‌డమ్ కారణంగా, ఈ బయోపిక్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. రష్మిక వంటి అగ్ర నటి ఇలాంటి సున్నితమైన, వివాదాస్పదంగా మారే అవకాశం ఉన్న పాత్రను అంగీకరిస్తుందా అనేది ప్రస్తుతం సినీ వర్గాల్లో సస్పెన్స్‌గా మారింది. ప్రత్యూష బయోపిక్ కనుక తెరకెక్కితే, అది భారతీయ సినిమాలో ఒక ముఖ్యమైన సినిమాగా నిలుస్తుంది. ఆ పాత్రకు రష్మిక న్యాయం చేయగలిగితే, అది ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం.