Kalyan Ram Amigos: అదిరిపోయిన ‘అమిగోస్’ టీజర్.. త్రిబుల్ రోల్‌లో కళ్యాణ్ రామ్

|

Jan 08, 2023 | 4:16 PM

హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత వరుస సినిమాలను లైనప్ చేస్తున్నారు కళ్యాణ్ రామ్.

Kalyan Ram Amigos: అదిరిపోయిన అమిగోస్ టీజర్.. త్రిబుల్ రోల్‌లో కళ్యాణ్ రామ్
Kalyan Ram Amigos
Follow us on

నందమూరి కళ్యాణ్ రామ్ హీరో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ అమిగోస్. ఇటీవలే బింబిసార సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించారు. ఈ సినిమా సక్సెస్ తర్వాత వరుస సినిమాలను లైనప్ చేస్తున్నారు కళ్యాణ్ రామ్. ఈ క్రమంలోనే మ‌రో డిఫ‌రెంట్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పించ‌టానికి క‌ళ్యాణ్ రామ్ ఆస‌క్తి చూపిస్తుంటారు. త‌న‌దైన పంథాలో క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘అమిగోస్’. డెబ్యూ డైరెక్ట‌ర్ రాజేంద్ రెడ్డితో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ రూపొందుతోన్నఈ చిత్రం టైటిల్ వినగానే అందరినీ ఆకట్టుకుంది. అమిగోస్ అంటే ఫ్రెండ్‌ను పిలిచే స్పానిష్ ప‌దం.

తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఇక ఈ టీజర్ లో త్రిబుల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు కళ్యాణ్ రామ్. టీజర్ చూస్తుంటే చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. మూడు పాత్రల్లో కళ్యాణ్ చూపించిన వేరియేషన్స్ ఆకట్టుకున్నాయి.

కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్స్, పోస్టర్స్ కారణంగా సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి.క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ‘అమిగోస్’ నిర్మాణం ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. దీంతో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తోనూ టీమ్ బిజీగా ఉంది. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 10, 2023న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..