
టాలీవుడ్ నుంచి పాన్ఇండియా హీరోగా ఎదిగిన నటుడు రెబల్ స్టార్ ప్రభాస్. తన ప్రొఫెషనల్ లైఫ్‌తో పాటు, వ్యక్తిగత జీవితంపై కూడా ఎప్పుడూ వార్తలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో, టాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించి, యువతను ఆకర్షించిన ఆ గ్లామర్ భామ… ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి! ఆ హీరో అంటే తనకు క్రష్ అంటోంది. అంతేకాదు, ‘ప్రభాస్ చాలా టెంప్టింగ్‌గా ఉన్నాడు!’ అంటూ పరోక్షంగా డబుల్ మీనింగ్ వచ్చేలా పోస్ట్ చేసింది. అసలు ఎవరా హీరోయిన్?
ప్రభాస్‌పై హాట్ కామెంట్స్ చేసిన హీరోయిన్ ఎవరో కాదు.. హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఈ భామ 2018లో వచ్చిన ‘RX 100’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ సినిమాతో ఈ బ్యూటీ ఓవర్ నైట్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో ‘వెంకీమామ’, ‘డిస్కో రాజా’, ‘మంగళవారం’ వంటి పలు సినిమాల్లో నటించింది. కానీ, ‘RX 100’ స్థాయి హిట్ మళ్లీ దక్కలేదు. దీంతో తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన గ్లామరస్ ఫోటోలతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తూ, క్రేజీ అప్‌డేట్స్‌ను ఇస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రెబల్ స్టార్ ప్రభాస్‌పై ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
How can someone be so innocent?
The industry toughens people up, making them thick-skinned, yet this guy still blushes easily and speaks very little because of his shyness.
Why so cute? God bless him 🪬♾️ pic.twitter.com/Y8w7ZZwcKp— paayal rajput (@starlingpayal) December 8, 2025
పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియా వేదికగా ప్రభాస్‌పై చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆమె దృష్టిలో ప్రభాస్ కేవలం పెద్ద స్టార్ మాత్రమే కాదు. సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ చాలా అమాయకంగా ఉంటాడని ఆమె రాసుకొచ్చింది. ఈ పరిశ్రమ ప్రజలను కఠినంగా, మందమైన చర్మం గల వారిగా మారుస్తుంది. అయినప్పటికీ ప్రభాస్ ఇంకా అమాయకంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుందని పేర్కొంది. ప్రభాస్ ఇప్పటికీ తేలికగా సిగ్గుపడతాడని పాయల్ చెప్పింది. అతని సిగ్గు కారణంగానే చాలా తక్కువ మాట్లాడతాడని పోస్ట్ చేసింది.
Prabhas And Payal Rajput
ఈ అమాయకత్వం, సిగ్గు ప్రస్తావన తర్వాత పాయల్ రాజ్‌పుత్ చేసిన చివరి కామెంట్లు అందరినీ ఆకర్షించాయి. “ప్రభాస్ ఎందుకంత ముద్దుగా ఉంటాడు? చాలా టెంప్టింగ్‌గా అనిపిస్తాడు!” అంటూ పరోక్షంగా డబుల్ మీనింగ్ వచ్చేలా పాయల్ పోస్ట్ చేసింది. చివరకు దేవుడు అతడిని దీవించుగాక అని ముగించింది. పాయల్ రాజ్‌పుత్ చేసిన ఈ కామెంట్లపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ వ్యక్తిగత జీవితం, అనుష్కతో డేటింగ్ వార్తలు తరచుగా వస్తున్న నేపథ్యంలో, పాయల్ చేసిన ఈ పోస్ట్ ఆమె కూడా ప్రభాస్‌కు ప్రయత్నాలు చేస్తుందా అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, పాయల్‌ను మరోసారి వార్తల్లో నిలిపింది.