Allu Arjun: ‘డాడీ’ కంటే ముందే అల్లు అర్జున్ సినిమాల్లో నటించారు! ఆ సినిమాలేవో తెలుసా?
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఐకాన్ స్టార్‌గా వెలుగొందుతున్న హీరో అల్లు అర్జున్. 'పుష్ప' సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకుని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అయితే, ఆయన కెరీర్ ప్రారంభంలో హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు, మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఒక డాన్సర్ పాత్రలో ..

ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఐకాన్ స్టార్‌గా వెలుగొందుతున్న హీరో అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకుని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అయితే, ఆయన కెరీర్ ప్రారంభంలో హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు, మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఒక డాన్సర్ పాత్రలో కనిపించారు. అదే ‘డాడీ’ సినిమా. ఆ సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు బన్నీ. అయితే, అంతకంటే ముందే అర్జున్ రెండు సినిమాల్లో నటించాడని చాలామందికి తెలియదు. ఇంతకీ డాడీ సినిమా కంటే ముందే బన్నీ కనిపించిన సినిమాలేవో చూద్దాం..
డాడీ కంటే ముందు..
అల్లు అర్జున్ పూర్తి స్థాయి హీరోగా 2003లో ‘గంగోత్రి’ సినిమాతో పరిచయమయ్యారు. ఆ సినిమా కంటే ముందు, 2001లో వచ్చిన చిరంజీవి సినిమా ‘డాడీ’లో ఒక చిన్న డాన్స్ బిట్ చేశారు. అయితే, ఈ రెండు సినిమాల కంటే ముందు కూడా ఆయన బాల నటుడిగా రెండు సినిమాల్లో కనిపించారు. 1985లో వచ్చిన చిరంజీవిగారి ‘విజేత’ సినిమాలో బాల నటుడిగా బన్నీ సినిమా కెరీర్ మొదలైంది. ఆ తర్వాత 1983లో వచ్చిన మరో గొప్ప సినిమా ‘స్వాతిముత్యం’లో కూడా బన్నీ బాల నటుడిగా కనిపించారు. ఈ రెండు సినిమాలు ఆయనకు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత దాదాపు 15 ఏళ్ల విరామం తీసుకున్న అల్లు అర్జున్, మళ్లీ ‘డాడీ’ సినిమాలో కనిపించారు.
చిరంజీవి మాటతోనే డాడీలో ఛాన్స్!
‘డాడీ’ సినిమాలో బన్నీ డాన్స్ చేయడం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. ముందుగా ప్లాన్ చేయకుండా, అనుకోకుండా ఆ సినిమాలో నటించాల్సి వచ్చిందని బన్నీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. “ఆ సమయంలో నేను పూర్తిగా డిస్కోటిక్ ప్రియుడిని. ‘డాడీ’ సినిమా షూటింగ్ జరుగుతుండగా, చిరంజీవిగారు నన్ను పిలిచి, ‘ఒక చిన్న డాన్స్ బిట్ చేస్తావా?’ అని అడిగారు. నేను ఆయన మాటలను కాదనలేకపోయా. అలా ఊహించని విధంగా ‘డాడీ’ సినిమాలో డాన్సర్‌గా కనిపించాను” అని అల్లు అర్జున్ తెలిపారు.

Chiru And Allu Arjun
ఆ సినిమాలో బన్నీ వేసిన క్రేజీ డాన్స్ స్టెప్పులకు చిరంజీవి కూడా ఫిదా అయ్యారు. అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయి చప్పట్లతో హోరెత్తించారు. ఈ చిన్న సీన్‌లో ఉన్న కొద్ది సమయం కూడా బన్నీ తన అద్భుతమైన డాన్సుతో మెప్పించారు. ఆ తర్వాత రెండేళ్లకే ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు.
బాల నటుడిగా అడుగుపెట్టి, డాన్సర్‌గా మెగాస్టార్ ఆశీస్సులతో మెరిసి, ఆ తర్వాత ఐకాన్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ ప్రయాణం.. సినిమా రంగంలో టాలెంట్, హార్డ్ వర్క్‌కు బెస్ట్ ఎంగ్జామ్పుల్. ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో తన తదుపరి సినిమా కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నారు.




