Director Maruthi: వివాదంలో ‘ది రాజాసాబ్’ డైరెక్టర్.. ఆ హీరో ఫ్యాన్స్‌కు మారుతి క్షమాపణలు.. ఏం జరిగిందంటే?

'ది రాజాసాబ్' డైరెక్టర్ మారుతి అనుకోకుండా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. ఆదివారం (నవంబర్ 24) జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా మారుతి చేసిన కొన్ని వ్యాఖ్యలు అతనిని ఇబ్బందుల్లో పడేశాయి. ఒక హీరో అభిమానులు మారుతిపై గుర్రుగా ఉన్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు మారుతి.

Director Maruthi: వివాదంలో ది రాజాసాబ్ డైరెక్టర్.. ఆ హీరో ఫ్యాన్స్‌కు మారుతి క్షమాపణలు.. ఏం జరిగిందంటే?
The Raja Saab Movie Director Maruthi

Updated on: Nov 24, 2025 | 5:59 PM

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ది రాజా సాబ్‌. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ రొమాంటిక్ కామెడీ హారర్ థ్రిల్లర్ ను రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం (నవంబర్ 24) ది రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందుకోసం ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి చేసిన కొన్ని కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. ముఖ్యంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ది రాజా సాబ్ డైరెక్టర్ పై భగ్గమంటున్నారు.
ది రాజా సాబ్ ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్ సందర్భంగా నిర్వహంచిన ఈవెంట్‌లో మారుతి మాట్లాడుతూ.. సినిమాను సంక్రాతికే విడుదల చేస్తున్నామన్నారు. అయితే ఈ సినిమా చూసి ఫ్యాన్స్‌ అంత కాలర్‌ ఎగురేసుకుంటారని అని చెప్పను. కానీ, ఇలాంటి మాటలు ఈ కటౌట్‌ ముందు చాలా చిన్నవి అంటూ వ్యంగ్యంగా అర్థం వచ్చేలా మాట్లాడారు. ఇవి కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో మారుతిపై జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ మండిపడుఉతన్నారు.

మారుతి కామెంట్స్ పై స్పందించిన ఒక ఎన్టీఆర్ అభిమాని ట్విట్టర్ (ఎక్స్) లో ఒక పోస్ట్ పెట్టాడు. ‘కాలర్‌ ఎగరేసుకుంటారని ఇలాంటివి చెప్పలేనని వ్యాఖ్యానించే బదులుగా ఈ సినిమా నెక్ట్స్‌ లెవెల్లో ఉంటుందని చెప్పి వదిలేస్తే బాగుండేది. లేదా ఈ కటౌట్‌కి ఏం చెప్పినా తక్కువే అన్న బాగుండేది. కానీ అవసరం లేకున్న పోలికలు చేశావు. ఈ మధ్య చిన్న సినిమాలు కూడా కాలర్‌ ఎగరేయడం వంటి కాన్సెప్ట్‌ని వాడుతున్నారు’ అంటూ రాసుకొచ్చారు. దీనికి మారుతి స్పందిస్తూ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ పట్ల నాకు అమితమైన గౌరవముంది.

‘డియర్‌ వెంకి.. నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. మొదట ప్రతి అభిమానికి నేను క్షమాపణలు చెప్తున్నా. ఇవి ఉద్దేశపూర్వకంగా చేసిన కామెంట్స్‌ కావు. ఎవరిని బాధపెట్టాలనే, కించపరిచే ఉద్దేశం నాకు అసలే లేదు. కొన్ని సార్లు మనం ప్రమేయం లేకుండానే కొన్ని మాటలు వస్తుంటాయి. అలా అనుకోకుండా మాట్లాడినవే నా మాటలు. ఇవి ఒకరిని ఉద్దేశించేలా ఉంటాయని నేను అసలు అనుకోలేదు. ఇవి ఇలా కంపేరిజన్‌ అయ్యి ఇలా తప్పుగా వెళుతుందని అసలు ఊహించలేదు. జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు అమితమైన గౌరవం. వారి ఫ్యాన్స్‌ పట్ల కూడా అదే గౌరవం ఉంది. సినిమాల పట్ల, మీ హీరో పట్ల మీకున్న అభిమానం, ప్రేమని నిజంగానే నేను గౌరవిస్తున్నాను’ అంటూ మారుతి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. మరి మారుతి సమాధానంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూల్ అవుతారో లేదా చూడాలి.

మారుతి ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..