AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Babu: నాగబాబు పేరును గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్న ఏకైక కమెడియన్..

జబర్దస్త్ ద్వారా చాలామంది కమెడియన్స్ బుల్లితెరకు పరిచయమయ్యారు. వారిలో చాలామంది ఇప్పుడు వెండితెరపై కూడా రాణిస్తున్నారు. అయితే ఈ షోకు గతంలో జడ్జిగా చేసిన నాగబాబుపై చాలామంది వివిధ రకాలుగా ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే ఓ కమెడియన్ ఏకంగా తన గుండెలపై ఆయన పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు.

Naga Babu: నాగబాబు పేరును గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్న ఏకైక కమెడియన్..
Nagababu
Ram Naramaneni
|

Updated on: Mar 24, 2026 | 9:34 AM

Share

జబర్దస్త్ అనేది మాములు కామెడీ ప్రొగ్రాం కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఈ షో ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంది. తొలినాళ్లలో ఈ షోకు మెగా బ్రదర్ నాగబాబు, నటి రోజా జడ్జిలుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ షో ఎంతో మంది కమెడియన్స్‌కు అన్నం పెట్టింది. వాళ్ల కుటుంబాలు మంచి బ్రతికేందుకు సాయం చేసింది. అంతేకాదు.. చాలామంది స్టార్స్ ఈ కార్యక్రమం ద్వారానే పుట్టుకొచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు దాదాపు 60 శాతం కమెడియన్స్‌ను జబర్దస్త్ కార్యక్రమం ప్రొడ్యూస్ చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇందులో పని చేసేవారికి ఏదైనా కష్టం వస్తే.. మిగతా అందూ చేయూతగా నిలుస్తారు. అప్పట్లో ఎవరికి ఇబ్బంది ఉన్న నాగబాబు ముందుండి ఆ సమస్యను పరిష్కరించేవారు. అందుకే ఆయనంటే చాలామందికి అభిమానం. అయితే ఓ కమెడియన్ నాగబాబుపై తనకున్న ప్రేమను చాటుతూ ఏకంగా తన గుండెలపై ఆయన పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఇంతకీ అతనెవరో మీకు తెలుసా..? కిర్రాక్ ఆర్పీ.

ఇందుకు గల కారణాలను ఆర్పీ గతంలో వివరంగా తెలియజేశాడు. నాగబాబు జబర్దస్త్ సభ్యుల పట్ల చూపిన మద్దతు, ఆయన వ్యక్తిత్వంలోని గొప్పతనం, వారితో ఉన్న అనుబంధమే దీనికి కారణమని వివరించారు. ఇన్ని సంవత్సరాలు నాగబాబును చూసిన తర్వాత.. అలాంటి గొప్ప వ్యక్తి పేరును తన గుండెపై వేయించుకోవాలని అనిపించి.. ఆ పని చేసినట్లు చెప్పారు. నాగబాబు తన తండ్రి లాంటి వ్యక్తి అని చెప్పారు. ఆయన్ను తాను విపరీతంగా అభిమానిస్తానని, ఆయనకు గొప్ప వ్యక్తిత్వం ఉందని పేర్కొన్నారు. ఎంతో మందికి సహాయం చేసిన, అన్నం పెట్టిన గొప్ప మనసున్న వ్యక్తి నాగబాబు అని ఆర్పీ కొనియాడారు. వ్యక్తిగతంగా ఆయనతో ఎక్కువ భావోద్వేగాలను పంచుకున్న వారిలో తాను ఒకడిని వెల్లడించారు.

కాగా ప్రస్తుతం నటనకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఆర్పీ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా కొనసాగుతున్నారు. ప్రతిపక్షంపై విమర్శలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెడుతున్నారు.

Also Read: ఎండాకాలంలో మిగిలిపోయిన పిడికెడు అన్నంతో విపరీతంగా మల్లె పూలు 

Follow Us