The Family Star OTT : ఓటీటీలో దూసుకుపోతున్న ఫ్యామిలీ స్టార్.. ఆ రెండు భాషల్లోనూ స్ట్రీమింగ్

|

May 24, 2024 | 5:24 PM

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత గీత గోవిందం సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆతర్వాత ఆ రేంజ్ లో హిట్ కొట్టలేకపోతున్నాడు. చివరిగా వచ్చిన మూడు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా డిజాస్టర్ అయ్యింది. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా పర్లేదు అనిపించుకుంది.

The Family Star OTT : ఓటీటీలో దూసుకుపోతున్న ఫ్యామిలీ స్టార్.. ఆ రెండు భాషల్లోనూ స్ట్రీమింగ్
Family Star
Follow us on

విజయ్ దేవరకొన్సా ఓ భారీ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా సాలిడ్ హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత గీత గోవిందం సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆతర్వాత ఆ రేంజ్ లో హిట్ కొట్టలేకపోతున్నాడు. చివరిగా వచ్చిన మూడు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా డిజాస్టర్ అయ్యింది. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు. థియేటర్స్ లో ఈ సినిమా యావరేజ్ గ నిలిచింది . కానీ ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతోంది ఫ్యామిలీ స్టార్ మూవీ.

అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీ స్టార్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్ లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఓటీటీలో వీక్షిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ఓటీటీలో ఈ మూవీకి మంచివ్యూస్ వస్తున్నాయి. దాంతో ఫ్యామిలీ స్టార్ సినిమాకు క్రేజ్ పెరిగింది. దాంతో ఈ సినిమాను ఇప్పుడు మరో రెండు భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్‌ 26న స్ట్రీమింగ్‌కు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా టాప్ 5లో ట్రెండింగ్ అవుతుంది ఈ సినిమా. ప్రస్తుతం ఈ మూవీ తెలుగు, తమిళం భాషల్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాను మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేశారు. విజయ్‌ దేవరకొండకు సౌత్‌లో ఉన్న క్రేజ్‌తో ఈ మూవీని మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. దాంతో ఫ్యామిలీ స్టార్ సినిమా ఓటీటీలో నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం విజయ్ మూడు డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

విజయ్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

విజయ్ దేవరకొండ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.