M. M. Keeravani: సరాగాల గని కీరవాణి మకుటంలో మరో కలికితురాయి.. పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం

|

Jan 25, 2023 | 11:35 PM

సినిమా పాటలకు తనదైన శైలిలో సంగీతంతో ప్రాణం పోస్తారు కీరవాణి. పిరియాడికల్ డ్రామా అయినా.. యాక్షన్ ఎంటర్టైనర్ అయినా.. లవ్ స్టోరీ అయినా కీరవాణి సంగీతంతో అది మరో లెవల్ కు వెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

M. M. Keeravani: సరాగాల గని కీరవాణి మకుటంలో మరో కలికితురాయి.. పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం
Keeravani
Follow us on

టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఎంఎం కీరవాణి ముందు వరసలో ఉంటారు. ఆయన సంగీతం చిన్న పెద్ద తేడాలేకుండా అందరిని అలరిస్తుంది. సినిమా పాటలకు తనదైన శైలిలో సంగీతంతో ప్రాణం పోస్తారు కీరవాణి. పిరియాడికల్ డ్రామా అయినా.. యాక్షన్ ఎంటర్టైనర్ అయినా.. లవ్ స్టోరీ అయినా కీరవాణి సంగీతంతో అది మరో లెవల్ కు వెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన నాటు నాటు సాంగ్ కు గోలేదేం గ్లొబ్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అలాగే ఆస్కార్ కు కూడా నామినేట్ అయ్యింది ఈ పాట. ఆర్ఆర్ఆర్ లో ఈ పాటకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు కీరవాణి.

తాజాగా కీరవాణికి మరో గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డ్స్ లో కీరవాణికి పద్మశ్రీ అవార్డు దక్కింది. క్రమంలోనే 2023 సంవత్సరానికి కూడా 106 మందితో కూడిన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతల జాబితాను గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందుగా ఈ రోజు(జనవరి 25) ప్రకటించింది కేంద్రం.

ఇక ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నలుగురు ఉండడం విశేషం. మొత్తం 106 మంది ఉన్న ఈ జాబితాలో సంగీత దర్శకుడు కీరవాణితో పాటు, చిన్నజీయర్ స్వామి కూడా ఉన్నారు. చిన్నజీయర్ స్వామికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్రం.