Oscar-2025: ఆస్కార్-2025 అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాలు ఇవే..

ఆస్కార్-2025 అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల జాబితాను అకాడమీ ప్రకటించింది. అత్యధిక కేటగిరిల్లో ది బ్రూటలిస్ట్‌, ఎమిలియా పెరెజ్‌ చిత్రాలు నామినేషన్స్‌ సొంతం చేసుకున్నాయి. ఇండియన్‌ మూవీస్‌కి తీవ్ర నిరాశ ఎదురైంది. వరల్డ్‌ వైడ్‌గా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్‌ నామినేషన్స్‌పై క్లారిటీ వచ్చింది

Oscar-2025: ఆస్కార్-2025 అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాలు ఇవే..
Oscar 2025

Updated on: Jan 24, 2025 | 9:29 AM

వరల్డ్‌ వైడ్‌గా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్‌ నామినేషన్స్‌పై క్లారిటీ వచ్చింది. 97వ అకాడమీ అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల జాబితాను విడుదల చేసింది. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో సత్తా చాటిన ది బ్రూటలిస్ట్‌, ఎమిలియా పెరెజ్‌ చిత్రాలు అత్యధిక కేటగిరిల్లో నామినేషన్స్‌ సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో కాన్‌క్లేవ్‌, అనోరా, ది సబ్‌స్టాన్స్‌, ది రియల్‌ పెయిన్‌, విక్డ్‌, ఎ కంప్లీట్‌ అన్‌నోన్‌, డ్యూన్‌ పార్ట్‌2 చిత్రాలున్నాయి. ఇక ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ‘అనోజా’ ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరిలో నామినేషన్‌ సొంతం చేసుకుంది.

ఆడమ్‌ జె.గ్రేవ్స్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రియాంక చోప్రా జోన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక.. ఈ ఏడాది మార్చి 2న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కోనన్‌ ఓబ్రియాన్‌ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇదిలావుంటే.. ఈ సారి ఇండియన్ మూవీలకు తీవ్ర నిరాశ ఎదురైంది. కంగువా, ది గోట్ లైఫ్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, సంతోష్, స్వాతంత్ర్య వీర సావర్కర్ చిత్రాలు నామినేషన్స్‌లో చోటు దక్కించుకోలేకపోయాయి.

కాగా.. గతంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్‌ మూవీలోని నాటు నాటు సాంగ్‌కి ది బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ వచ్చింది. ఇక.. గతంలోనే విడుదల కావాల్సిన ఆస్కార్‌ నామినేషన్స్ చిత్రాల జాబితా.. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో దావానంలా వ్యాపించిన కార్చిచ్చు కారణంగానామినేషన్ల కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే.. తాజాగా అవార్డుల నామినేషన్ల చిత్రాల జాబితాను అకాడమీ ప్రకటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.