S. Thaman : దేవీ శ్రీ పై క్రేజీ కామెంట్స్ చేసిన తమన్.. డార్లింగ్ బ్రదర్ అంటూ డీఎస్పీ ట్వీట్

టాలీవుడ్ లో ట్రేండింగ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు దేవీ శ్రీ ప్రసాద్, తమన్ ఇద్దరు ఇద్దరే ఎవరికీ వారే సాటి.

S. Thaman : దేవీ శ్రీ పై క్రేజీ కామెంట్స్ చేసిన తమన్.. డార్లింగ్ బ్రదర్ అంటూ డీఎస్పీ ట్వీట్
Thaman Dsp

Updated on: Mar 28, 2022 | 8:06 PM

S. Thaman : టాలీవుడ్ లో ట్రేండింగ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad ), తమన్ ఇద్దరు ఇద్దరే ఎవరికీ వారే సాటి. అదిరిపోయే మ్యూజిక్.. దద్దరిల్లే బిజీ లతో సినిమా రేంజ్ నే పెంచేస్తారు ఈ ఇద్దరు. దేవీ శ్రీ ప్రసాద్ , తమన్ సంగీతం అందించిన సినిమాలు చాలా వరకు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఇటీవల తమన్ జోరు  పెంచారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు దేవీ కూడా సెలక్టవీవ్ గా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. అయితే ఈ  ఇద్దరు మధ్య మంచి స్నేహం ఉందన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ విషయంలో పోటీ పడినా ఈ వీరిద్దరూ బయట మంచి ఫ్రెండ్స్. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంలో ఇద్దరు పాల్గొని సందడి చేశారు.

తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు  ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి తమన్ జడ్జ్ గా  వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో ఓ సింగర్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలను షోలో ఆలపించారు. ఆ పాటపై కామెంట్ చేస్తూ తమన్ దేవీ శ్రీ పై ప్రశంసలు కురిపించారు. ఆయన ఒక కొరియోగ్రాఫర్ గా డాన్సర్ గా మ్యుజీషన్ గా దేవీలో చాలా టాలెంట్ ఉంది అని తమన్ అన్నారు. ఆయనకు ఒక పాటను ఎలా కొరియోగ్రాఫ్ చేయాలో కూడా తెలుసు అన్నారు. పాటను ఎక్కడ మొదలుపెట్టాలో ఎక్కడ ఆపాలో ఆయనకు బాగా తెలుసు అని అన్నారు. దీని పై దేవీ టీవీ ట్వీట్ చేశారు. థాంక్యూ డార్లింగ్ బ్రదర్.. సో స్వీట్ ఆఫ్ యూ  అంటూ ట్వీట్ చేశారు దేవీ. ఇలా ఒకరి పై ఒకరు ప్రేమ చూపించుకోవడంతో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దేవీ చేతిలో పుష్ప 2తో పాటు మరి కొన్ని సినిమాలు ఉన్నాయి. అలాగే తమన్ చేతితో ఏడూ ఎనిమిది వరకు సినిమాలు ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Oscars 2022: భార్యపై కుళ్లు జోకులు.. స్టేజ్ పైనే హోస్ట్ చెంప చెల్లుమనించిన హీరో.. ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ సీన్..

Oscar Winners 2022: ఆస్కార్ అవార్డులలో డ్యూన్ చిత్రయూనిట్ హవా.. విన్నర్స్ ఎవరెవరంటే..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. బాబీ మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. భారీ యాక్షన్ షెడ్యూల్..