
అక్కినేని అఖిల్, జైనబ్ రవ్డీల పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జూన్ 6న పెళ్లి వేడుక, 8న రిసెప్షన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికీ నెట్టింట వైరలవుతున్నాయి. అఖిల్, జైనబ్ ల పెళ్లి వేడుకకు పరిమిత సంఖ్యలోనే సెలబ్రిటీలు వచ్చినా రిసెప్షన్ కు మాత్రం అతిథులు పోటెత్తారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు విచ్చేసి నూతన దంపతులను మనసారా ఆశీర్వదించారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ కు వచ్చారు. అందులో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఉన్నాడు. సినిమాల్లో తన మ్యూజిక్ తో మోత మోగించే తమన్ నిజ జీవితంలో మాత్రం ఎంతో సరదాగా ఉంటాడు. అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ లోనూ అదే జరిగింది. ముఖ్యంగా అఖిల్ కు తమన్ ఇచ్చిన మ్యారేజ్ గిఫ్ట్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మొదట తమన్ తో పాటు శ్రీకాంత్, రోషన్ తదితర సినీ ప్రముఖులు స్టేజ్ మీదకు వచ్చారు. శ్రీకాంత్ తన కొడుకు రోషన్‌ను అఖిల్- జైనాబ్ లను పరిచయం చేస్తుండగా.. తమన్ వెంటనే క్రికెట్ బ్యాట్ ను తీసి అఖిల్ కు బహుమతిగా అందించాడు. దీనిని చూసిన అఖిల్ పక్కున నవ్వేశాడు. జైనాబ్ కూడా ముసి ముసి నవ్వులు నవ్వింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరలయ్యింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేశారు. తమన్ మాములోడు కాదు అంటూ స్పందిస్తున్నారు.
కాగా అఖిల్ మంచి క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. గ్రౌండ్‌లోకి దిగితే సిక్సుల మోత మోగిస్తాడు. ఇక తమన్ కూడా క్రికెట్ ఆడతాడు. వీరిద్దరూ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో కలిసి ఆడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సరదాగా అఖిల్ పెళ్లికి క్రికెట్ బ్యాట్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు తమన్.
Thaman gifted a cricket bat to #AkhilAkkineni at his reception! pic.twitter.com/Mu914iRI2a
— Movies4u Official (@Movies4u_Officl) June 11, 2025
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు అఖిల్. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్, గ్లింప్స్ అక్కినేని అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
All of it for you 🙂 #LENIN 🔥
Thank you for the lovely wishes 🙏🏻 pic.twitter.com/wmqUIbN4ob— Akhil Akkineni (@AkhilAkkineni8) April 8, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..