Varasudu: విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న దళపతి సినిమా.. తాజాగా మరో ఘనత..

దళపతి తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వారసుడు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Varasudu: విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోన్న దళపతి సినిమా.. తాజాగా మరో ఘనత..
Vijay Thalapathy

Edited By:

Updated on: Oct 25, 2022 | 9:30 AM

తమిళ్ లోనే కాదు ఇక్కడ కూడా దళపతి విజయ్ కు మంచి ఫ్యాన్స్ బేస్ ఉంది.. ప్రస్తుతం దళపతి తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వారసుడు అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వారసుడు ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు విజయ్. భారీ అంచనాలు వున్న ఈ కాంబినేషన్ ఫస్ట్ లుక్ తో ఆ అంచనాలని మరింత భారీగా పెంచింది.

‘వారసుడు’ చివరి షెడ్యూల్ షూటింగ్ తాజాగా ప్రారంభమైయింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి కేవలం 2 యాక్షన్ సీక్వెన్సులు, 2 పాటలు మాత్రనే మిగిలివున్నాయి. ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. వారసుడు సినిమా ఆడియో రైట్స్‌ దాదాపు రూ.10 కోట్లకు అమ్ముడయ్యాయట. ఈ నెంబర్‌ అటు విజయ్‌ కెరీర్‌లోనూ.. ఇటు థమన్‌ కెరీర్‌లోనూ బిగ్గెస్ట్‌ అట. అంతేకాకుండా తమిళంలోనూ అత్యధిక రేటుకు అమ్ముడైన టాప్‌-5 మ్యూజిక్‌ ఆల్బమ్‌లలో ఒకటిగా నిలిచింది. మరి ఈ సినిమా రిలీజ్ అయినతర్వాత ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.