Thalapathy Vijay: 10,12వ తరగతి విద్యార్థులకు దళపతి విజయ్ సాయం.. ఏకంగా 234 నియోజకవర్గాల్లోని..

|

May 10, 2024 | 10:24 PM

కోలీవుడ్‌ స్టార్ హీరో దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళ్‌ లో సూపర్‌ స్టార్ గా వెలుగొందుతోన్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈ స్టార్ హీరో వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు.

Thalapathy Vijay: 10,12వ తరగతి విద్యార్థులకు దళపతి విజయ్ సాయం.. ఏకంగా 234 నియోజకవర్గాల్లోని..
Thalapathy Vijay
Follow us on

కోలీవుడ్‌ స్టార్ హీరో దళపతి విజయ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళ్‌ లో సూపర్‌ స్టార్ గా వెలుగొందుతోన్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈ స్టార్ హీరో వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. కాగా విజయ్ కు సామాజిక దృక్పథం ఎక్కువే. సినిమా షూటింగులతో బిజీగా ఉంటున్నా తన వంతు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. కొన్ని నెలల క్రితం తమిళనాడు వరద బాధితులకు భారీ గా విరాళాలు ఇచ్చి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. అలాగే 12వ తరగతి పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులకు ప్రోత్సాహకరంగా బహుమతులు అందజేశాడు. కాగా గతేడాది 12వ తరగతి పరీక్షలో 600/600 మార్కులు సాధించిన నందినికి కానుకగా డైమండ్‌ నెక్లెస్‌ ను కానుకగా ఇచ్చాడు. అదే సమయంలో రెండు వేల మంది ఉత్తమ విద్యార్థులకు ఆర్థిక సాయం చేశాడు. ఇప్పుడు కూడా మరోసారి విద్యార్థులకు సాయ మందించేందుకు రెడీ అయ్యారీ స్టార్ హీరో. గతేడాది విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి మరీ 10, 12వ తరగతి విద్యార్థులందరికీ బహమతులు ప్రదానం చేశాడు విజయ్.

విజయ్ దళపతి జూన్ 22న తన పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది లాగే ఈ సారి కూడా విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయాలని నిర్ణయించుకున్నాడు విజయ్. . తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో 10, 12వ తరగతి ఫలితాల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఎంచుకుని వారందరినీ పిలిపించి బహుమతులు అందించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పదో తరగతి, 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్ధులను తమిళనాడు వెట్రి కజగం తరపున విజయ్‌ ఓ ప్రకటనలో అభినందిస్తూ, త్వరలోనే కలుస్తామని ప్రకటించారు. జూన్ 22న విజయ్ 50వ పుట్టినరోజు ఉంది కాబట్టి ఆరోజే విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగవచ్చని తెలుస్తోంది. ఇందుకోసం 234 నియోజకవర్గాల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన పదో తరగతి, 12వ తరగతి విద్యార్థులను గుర్తించే పనిని విజయ్ తన అభిమానులకు అప్పచెప్పినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.