Thalapathy Vijay: ఆఖరి సినిమాకు విజయ్ అద్దిరిపోయే రెమ్యునరేషన్ .. ఇండియాలోనే అత్యధికంగా.. ఎన్నికోట్లంటే?

|

Sep 15, 2024 | 7:29 AM

భారతదేశంలో ఒక సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా ఒకరు. కొద్ది రోజుల క్రితం విడుదలైన భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించే సెలబ్రిటీల జాబితాలో దళపతి విజయ్ బాలీవుడ్ పెద్ద స్టార్లను అధిగమించి రెండవ స్థానంలో నిలిచాడు. ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్ ఇకపై సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నాడు.

Thalapathy Vijay: ఆఖరి సినిమాకు విజయ్ అద్దిరిపోయే రెమ్యునరేషన్ .. ఇండియాలోనే అత్యధికంగా.. ఎన్నికోట్లంటే?
Thalapathy Vijay
Follow us on

భారతదేశంలో ఒక సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా ఒకరు. కొద్ది రోజుల క్రితం విడుదలైన భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించే సెలబ్రిటీల జాబితాలో దళపతి విజయ్ బాలీవుడ్ పెద్ద స్టార్లను అధిగమించి రెండవ స్థానంలో నిలిచాడు. ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్ ఇకపై సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా శనివారం (సెప్టెంబర్ 14) తన కొత్త, చివరి సినిమాను ప్రకటించాడు. కాగా ఈ సినిమా కోసం ఆయన భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోనున్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దళపతి విజయ్ 69వ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా విజయ్‌కి చివరి సినిమా అవుతుంది. ఈ చిత్రాన్ని కన్నడ కెవీఎం ప్రొడక్షన్ హౌస్ నిర్మించనుంది. ఇదే తన చివరి సినిమా అని కూడా అధికారికంగా ప్రకటించారు కూడా. ఈ చిత్రం విజయ్ అభిమానులకు చాలా ప్రత్యేకమైనది. ఈ నేపథ్యంలోనే తన చివరి సినిమాకు విజయ్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోనున్నారని సమాచారం.

విజయ్ తన 69వ సినిమా కోసం ప్రొడక్షన్ హౌస్ నుండి 275 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకోనున్నారని టాక్. ఇప్పటివరకు ఇండియాలో మరే నటుడూ ఇంత భారీ రెమ్యూనరేషన్ అందుకోలేదని అంటున్నారు. కొన్ని వారాల క్రితం, భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుల జాబితా విడుదలైంది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సినీ సెలబ్రిటీల జాబితాలో దళపతి విజయ్ రెండో స్థానంలో ఉన్నాడు. బాలీవుడ్ బాద్ షారూఖ్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ కంటే విజయ్ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడని అంటున్నారు. షారుఖ్ ఖాన్ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నప్పటికీ, అతను సాధారణంగా సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేస్తాడు. కానీ విజయ్ ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చేస్తాడు. ఒక్కోసారి మూడు సినిమాలు కూడా చేశాడు.

ఇవి కూడా చదవండి

 

టార్చ్ బేరర్ లా విజయ్ ఆఖరి సినిమా..

ఎన్నికలకు ముందు రిలీజయ్యేలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.