దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ లియో. థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. మొదట్లో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ రాను రాను ఈ సినిమా పై పాజిటివిటి పెరిగింది. అలాగే లియో సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ఊహాగానాలు కూడా ఎక్కువయ్యాయి. అసలు విషయం ఏంటంటే లోకేష్ కానగరాజు డైరెక్షన్ లో తెరకెక్కిన లియో సినిమా అక్టోబర్ 19న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా లోకేష్ తెరకెక్కించిన ఖైదీ, విక్రమ్ సినిమాలతో లింక్ అయ్యి ఉండటంతో ఈ మూవీ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. విక్రమ్ సినిమాలోలా క్లైమాక్స్ లో స్టార్ హీరో ఎంట్రీ ఉంటుందని అందరూ ఊహించారు.
కానీ చివర్లో కేవలం కమల్ హాసన వాయిస్ మాత్రమే ఉండటంతో అభిమానులు ఒకింత నిరాశపడ్డారు. ఇదిలా ఉంటే లియో సినిమా ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫిక్స్ లియో సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకుంది.
ఈ నెల 24 అంటే నేటి నుంచి లియో సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. నిన్న అర్ధరాత్రి నుంచి లియో సినిమాను స్ట్రీమింగ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. మంచి వ్యూస్ సంపాదించుకుంటున్న లియో ఓటీటీలో రికార్డ్ క్రియేట్ చేయడం పక్కాగా కనిపిస్తుంది. లియో సినిమాలో విజయ్ రెండు డిఫరెంట్ షెడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారు. ఈ సినిమాలో విజయ్ కు జోడీగా త్రిష నటించింది. అలాగే కీలక పాత్రలో మడోనా సెబాస్టియన్ నటించింది.
#Leo – Behind The Scene ❤️ @actorvijay pic.twitter.com/4sZzz95Ncf
— #LEO OFFICIAL (@TeamLeoOffcl) November 14, 2023
Chellom @actorvijay 🥰 pic.twitter.com/PKBS0fc4fT
— #LEO Film (@LeoMovieOffI) November 1, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.