కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ది గోట్.. ‘ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ యాక్షన్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటులు స్నేహ, ప్రశాంత్, ప్రభు దేవా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ది గోట్ సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా ది గోట్ చిత్ర బృందం తాజాగా దివంగత నటుడు విజయకాంత్ ఇంటికి వెళ్లారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత విజయ్ కాంత్ సతీమణి డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలతతో కాసేపు మట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు డైరెక్టర్ వెంకట్ ప్రభు. దీనికి కెప్టెన్ ఆశీర్వాదం తీసుకున్నాం అని క్యాప్షన్ జోడించారు.
కాగా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ సినిమాలో ఏఐ సాయంతో దివంగత నటుడు విజయకాంత్‌ను చూపించబోతున్నారు వెంకట్ ప్రభు. హీరో విజయ్, ఆయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ కు విజయ కాంత్ అంటే చాలా ఇష్టం. అలాగే విజయ కాంత్ అంటే కూడా హీరో విజయ్ కు చాలా గౌరవం. వీరి కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో వెట్రి, సెంతూరపండి తదితర చిత్రాల్లో కలిసి నటించారు విజయ్, విజయ కాంత్. కాగా విజయకాంత్ మరణం తర్వాత తన రూపాన్ని సినిమాలో వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు డైరెక్టర్ వెంకట్ ప్రభు. దీనిపై పలుమార్లు ప్రేమలతను విజ్ఞప్తి చేసి అనుమతి పొందారు. అలా గోట్ సినిమాలో ఏఐ టెక్నాలజీ సాయంతో విజయకాంత్‌ను సిల్వర్ స్క్రీన్ పై చూపించబోతున్నారు. మొత్తానికి చాలా రోజుల తర్వాత కెప్టెన్ అభిమానులు మళ్లీ విజయ కాంత్ ను వెండితెరపై చూడనున్నారన్నమాట.
சற்று முன் நடிகர் விஜய், சாலிகிராமத்தில் உள்ள இல்லத்தில் மரியாதை நிமித்தமாக என்னை நேரில் சந்தித்தார்!@actorvijay@vp_offl@archanakalpathi#PremalathaVijayakanth #actorvijay pic.twitter.com/9NQW2lzj5U
— Premallatha Vijayakant (@PremallathaDmdk) August 19, 2024
He is the G.O.A.T of records ❤️🔥#GOATTrailer 10M+ real time views #TheGOAT #TheGreatestOfAllTime pic.twitter.com/TwyOwQLyDh
— T-Series South (@tseriessouth) August 17, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.