
సినీ ప్రియులు.. నటీనటులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న 69వ జాతీయ పురస్కారాల వేడుక ప్రారంభమైంది. 2021 ఏడాదికి సంబంధించి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ను గురువారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. న్యూఢిల్లీలో నేషనల్ మీడియా సమావేశంలో ఈ అవార్డ్స్ విజేతలను అనౌన్స్ చేసింది. 28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీ పడినట్లు I&B అదనపు కార్యదర్శి నీర్జా శేఖర్ తెలిపారు. పుష్ప చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డ్ అందుకున్నారు. మొట్ట మొదటి తెలుగు జాతీయ నటుడిగా పురస్కారం అందుకుని బన్నీ రికార్డ్ క్రియేట్ చేశారు.
69 ఏళ్ల సినీ చరిత్రలో మొదటి తెలుగు హీరోకు జాతీయ నటుడిగా అవార్డ్ వచ్చింది. దీంతో సినీ ప్రియులు.. నటీనటులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఎవరెవరు ఏఏ విభాగాల్లో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 అందుకున్నారో తెలుసుకుందామా.
ఉత్తమ తెలుగు సినిమా: ఉప్పెన (బుచ్చిబాబు సన)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప)
ఉత్తమ సినీ గేయ రచయిత: చంద్రబోస్.. కొండపొలం సినిమాకు గానూ.
బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ. ఆర్ఆర్ఆర్..
బెస్ట్ కొరియోగ్రఫర్.. ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్)
బెస్ట్ పాపులర్ ఫిల్మ్.. ఆర్ఆర్ఆర్
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ క్రియేటర్.. (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్.. కింగ్ సాలమన్ (ఆర్ఆర్ఆర్ )
బెస్ట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. కీరవాణి (ఆర్ఆర్ఆర్)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్.. కాళభైరవ.. (ఆర్ఆర్ఆర్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్.. పుష్ప.. దేవీ శ్రీ ప్రసాద్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.