AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramam Raghavam Movie : దర్శకుడిగా ధనరాజ్.. “రామం రాఘవం” సినిమా నుంచి అందమైన పాట

కమెడియన్ వేణు ఇటీవలే బలగం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఇదేదారిలో ధనరాజ్ కూడా సినిమా చేస్తున్నాడు. ధనరాజ్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ రామం రాఘవం. ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు

Ramam Raghavam Movie : దర్శకుడిగా ధనరాజ్.. రామం రాఘవం సినిమా నుంచి అందమైన పాట
Ramam Raghavam
Rajeev Rayala
|

Updated on: Sep 06, 2024 | 8:36 PM

Share

చాలా మంది కమెడియన్స్ ఇప్పుడు దర్శకులుగా హీరోలుగా మరి సినిమాలు చేస్తున్నారు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన చాలా మంది ఇప్పుడు సినిమా రంగంలో రాణిస్తున్నారు. కమెడియన్ వేణు ఇటీవలే బలగం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఇదేదారిలో ధనరాజ్ కూడా సినిమా చేస్తున్నాడు. ధనరాజ్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ రామం రాఘవం. ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ‘రామం రాఘవం’ అనే ఆసక్తికర టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింమ్స్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇక ఇప్పుడు ఈ  చిత్రంలోని తొలి సింగిల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. స్మాల్ స్క్రీన్‌పై దర్శకుడిగా అరంగేట్రం చేసిన సముద్రఖని ఆ తర్వాత వెండితెరపై దర్శకుడిగా మారారు. వెండితెరపై దర్శకుడిగా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన తర్వాత హీరోగా నటించడం ప్రారంభించాడు. ఆ తర్వాత విలన్‌తోపాటు ముఖ్యమైన పాత్రల్లో తనదైన నటనను కనబరిచి అభిమానుల మదిలో స్థానం సంపాదించుకున్నాడు సముద్రఖని.

ప్రస్తుతం సముద్రకని నటిస్తున్న చిత్రం ‘రామం రాఘవం’. ఈ చిత్రానికి ఈ చిత్రం తెలుగు,తమిళ్ భాషలలో రూపొందిస్తున్నారు. తండ్రీ కొడుకుల అనుబంధం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని. ఈ దశలో ఈ చిత్రంలోని తొలి పాట లిరిక్స్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. “తెలిసింద నేడు.. గమనించి చూడు.. నిను కన్న తోడు విలువేంటని.. నిశి నీడలోనూ.. నిను వీడిపోని ఒక నాన్న మనసు బరువెంతని” అంటూ సాగే సా పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ పాటను శ్రీకాంత్ హరిహరన్ పాడారు. అరుణ్ సిల్వేరు ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సునీల్, సత్య, పృద్వి, శ్రీనివాసరెడ్డి ఇతర పాత్రలు పోషించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.