లాక్ డౌన్ క‌ష్టాలు : మేక‌ప్ మ్యాన్ వ‌ద్ద అప్పు చేసిన న‌టి..

ఒక న‌టి… త‌న మేక‌ప్ మ్యాన్ ద‌గ్గ‌ర అప్పుతీసుకుంటే న‌మ్ముతారా..అవును విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా..ఇది నిజం. నిర్మాత‌లు డ‌బ్బులివ్వ‌క చేతులెత్తేయ‌డంతో..చేసేదేం లేక మేక‌ప్ మ్యాన్ ద‌గ్గ‌ర రూ.15వేలు తీసుకున్నాన‌ని స్వ‌యంగా టీవీ న‌టే వెల్ల‌డించింది. లాక్ డౌన్ వ‌ల‌న షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అవ్వ‌డంతో త‌న‌కి ఈ ఇబ్బంది ఎదురైంద‌ని చెప్పుకొచ్చింది. నటి సోనాల్ వెంగర్లేకర్ ప‌లు టీవీ సీరియ‌ల్స్‌లో యాక్ట్ చేస్తోంది. లాక్ డౌన్ ప్ర‌క‌టించిన‌ ఈ రెండు నెలల్లో తన వద్ద ఉన్న డ‌బ్బు […]

లాక్ డౌన్ క‌ష్టాలు : మేక‌ప్ మ్యాన్ వ‌ద్ద అప్పు చేసిన న‌టి..

Updated on: May 16, 2020 | 10:25 PM

ఒక న‌టి… త‌న మేక‌ప్ మ్యాన్ ద‌గ్గ‌ర అప్పుతీసుకుంటే న‌మ్ముతారా..అవును విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా..ఇది నిజం. నిర్మాత‌లు డ‌బ్బులివ్వ‌క చేతులెత్తేయ‌డంతో..చేసేదేం లేక మేక‌ప్ మ్యాన్ ద‌గ్గ‌ర రూ.15వేలు తీసుకున్నాన‌ని స్వ‌యంగా టీవీ న‌టే వెల్ల‌డించింది. లాక్ డౌన్ వ‌ల‌న షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అవ్వ‌డంతో త‌న‌కి ఈ ఇబ్బంది ఎదురైంద‌ని చెప్పుకొచ్చింది.

నటి సోనాల్ వెంగర్లేకర్ ప‌లు టీవీ సీరియ‌ల్స్‌లో యాక్ట్ చేస్తోంది. లాక్ డౌన్ ప్ర‌క‌టించిన‌ ఈ రెండు నెలల్లో తన వద్ద ఉన్న డ‌బ్బు మొత్తం అయిపోయింద‌ట‌‌. ఈ స‌మ‌యంలో తనకు పారితోష‌కం ఇవ్వాల్సిన నిర్మాత ఒకరికి కాల్ చేసి డబ్బులడగగా అతను రెస్పాండ్ అవ్వ‌డం లేద‌ని చెపుతోంది. ప‌దే, ప‌దే కాల్ చెయ్య‌డంత‌తో అత‌డు నెంబర్ బ్లాక్ చేసాడట. చేసేదేం లేక మేకప్ మ్యాన్ తో తన ప్రాబ్లమ్ చెప్పుకుంద‌ట‌. సోనాల్ ప‌రిస్థితిని గ్ర‌హించి పంక‌జ్ గుప్తా అనే మేక‌ప్ మ్యాన్ త‌న భార్య డెలివ‌రీ ఖ‌ర్చు కోసం రూ.15 వేలు ఇచ్చి.. అవ‌స‌రైమ‌నప్పుడు అడుగుతాన‌ని చెప్పాడ‌ట‌. మేకప్ మ్యాన్ మంచి మ‌న‌సు చూసి కన్నీటి పర్యంతం అయ్యానని సోనాల్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ ను పెట్టింది.