Actor Nagarjuna: హీరో నాగార్జునకు ఊరట.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలని హైకోర్టు ఉత్తర్వులు..

|

Aug 24, 2024 | 2:57 PM

హైదరాబాద్ మాదాపూర్‏లో ఆయనకు చెందిన N కన్వెన్షన్ సెంటర్‏ను శనివారం ఉదయం హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కూల్చివేతలను ఆపాలంటూ నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Actor Nagarjuna: హీరో నాగార్జునకు ఊరట.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలని హైకోర్టు ఉత్తర్వులు..
Nagarjuna
Follow us on

టాలీవుడ్ హీరో నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ మాదాపూర్‏లో ఆయనకు చెందిన N కన్వెన్షన్ సెంటర్‏ను శనివారం ఉదయం హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కూల్చివేతలను ఆపాలంటూ నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కూల్చివేతలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అప్పటికే హైడ్రా అధికారులు N కన్వెన్షన్ సెంటర్‏ను పూర్తిగా నేలమట్టం చేశారు.

శనివారం ఉదయం హైదరాబాద్ మాదాపూర్‏లోని N కన్వెన్షన్ సెంటర్‏ను హైడ్రా అధికారులు కూల్చివేయగా.. హీరో నాగార్జున స్పందించారు. చెరువు భూమిని ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. ఈ కూల్చివేతకు తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని.. ఈ విషయంపై తమ గురించి ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతకు ముందుకు తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని.. ఓవైపు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని..చట్టాన్ని గౌరవించే పౌరుడిగా..కోర్టు తమకు వ్యతిరేకంగా తీర్పునిస్తే తామే కూల్చివేసేవాళ్లమని హీరో నాగార్జున ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

” స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం, చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను. ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. -అక్కినేని నాగార్జున” అంటూ ట్వీట్ చేశారు.

N కన్వెన్షన్ సెంటర్..

N కన్వెన్షన్ సెంటల్ 3 రియాల్టీ ఎంటర్టైప్రైజెస్ కింద నడుస్తోంది. దీనిని పిల్లర్లు లేకుండా హైసీలింగ్ లో నిర్మించారు.దాదాపు 2 వేల నుంచి 3 వేల మంది కూర్చునేలా మెయిన్ హాల్ ఉంటుంది. 350 నుంచి 450 మంది కూర్చునేలా డైమండ్ హాల్ నిర్మించారు. 500 నుంచి 750 సీట్ల సామర్థ్యంతో బనయన్ హాల్ నిర్మించారు. 2015 ఆగస్ట్ 20 నుంచి ఇందులో కార్యకలాపాలు నడుస్తున్నాయి. సోషల్ ఈవెంట్స్, ప్రీ వెడ్డింగ్స్, పెళ్లి వేడుకలకు దీనిని అద్దెకు ఇస్తుంటారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.