
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయెల్ రోల్ లో నటించారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్స్, ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూడు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. సింహ, లెజెండ్, అఖండ ఈ మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. ఇక ఇప్పుడు అఖండ 2 సినిమాతో రాబోతున్నారు బాలకృష్ణ. అప్పటి వరకు 50 కోట్ల దగ్గరే ఆగిన బాలయ్య సినిమాలు.. అఖండ తర్వాత 100 కోట్లకు తగ్గనంటున్నాయి.అఖండతో తొలిసారి 100 కోట్లు కొట్టిన బాలయ్య.. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహారాజ్ సినిమాలతో వరసగా నాలుగు సార్లు 100 కోట్లు అందుకున్న తొలి సీనియర్ హీరోగా చరిత్ర సృష్టించారు.
ఇక ఇప్పుడు అఖండ 2 సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే శుక్రవారం థియేటర్స్ లోకి రానున్న అఖండ 2 సినిమాకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి అఖండ 2 ప్రీమియర్స్ మొదలు కానున్నాయి.
ప్రీమియర్స్ కు రూ. 600 రూపాయిలు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు రూ. 50 రూపాయిలు అలాగే మల్టీప్లక్స్ లో రూ. 100 రూపాయిలు టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. ఈ అనుమతి కేవలం మూడు రోజులు మాత్రమే.. మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో అఖండ 2 సినిమా టికెట్స్ రేటు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్పెషల్ షోకు టికెట్ ధర రూ. 600గా నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ. 75 పెంపు. మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరపై రూ. 100 పెంపునకు అనుమతినిచ్చింది. అలాగే డిసెంబర్ 5న సినిమా విడుదలైన తర్వాత, మొదటి పది రోజుల పాటు ఏపీలో పెరిగిన ధరలు అమలులో ఉంటాయి. తెలంగాణలో అఖండ 2 టికెట్ ధరలు పెంచింది ప్రభుత్వం. సింగిల్ స్క్రీన్స్‌లో 50 .. మల్టీప్లెక్స్‌ల్లో 100 రూపాయలు పెంచింది. పెంచిన ధరలు ఈనెల 5 నుంచి 7 వరకు అమల్లో ఉండనున్నాయి. అయితే ఈ ఆదాయంలో 20% సినీ వర్కర్లకు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా సినీకార్మికులకు మాటిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. టికెట్ ధరలు పెంచితే అందులో కార్మికులకు షేర్ ఉండాల్సిందేనన్నారు. అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అఖండ-2 నుంచే 20శాతం ఆదాయం కార్మికులకు ఇవ్వాలన్న నిబంధనను అమల్లోకి తెచ్చారు. అఖండ-2 సినిమాకు పెంచిన ధరల ద్వారా వచ్చిన ఆదాయంలో 20శాతం మూవీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు వెళ్లనుంది. సినీ కార్మికుల సంక్షేమం కోసం ఈ డబ్బును వినియోగించనున్నారు. ఫిల్మ్ డెవలమెంట్ కార్పొరేషన్ ప్రత్యేక బ్యాంకు అకౌంట్‌ను తెరిచింది . ఈ అకౌంట్‌ను లేబర్ కమిషనర్ పర్యవేక్షించనున్నారు. తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారంటూ రేవంత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సినీ కార్మికులు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .