Theaters Reopen: ఏదేమైనా ఈ నెలాఖరుకల్లా థియేటర్లు ఓపెన్‌ చేస్తాం.. స్పష్టం చేసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్‌..

Theaters Reopen: కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంల్లో సినీ రంగం ఒకటి. లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడడంతో ఇండస్ట్రీకి తీవ్ర నష్టం ఎదురైంది. దీంతో చాలా మంది చిన్న చిన్న నటీనటులు, సిబ్బంది..

Theaters Reopen: ఏదేమైనా ఈ నెలాఖరుకల్లా థియేటర్లు ఓపెన్‌ చేస్తాం.. స్పష్టం చేసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్‌..
Theaters Re Open

Edited By: Narender Vaitla

Updated on: Jul 11, 2021 | 6:34 PM

Theaters Reopen: కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంల్లో సినీ రంగం ఒకటి. లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడడంతో ఇండస్ట్రీకి తీవ్ర నష్టం ఎదురైంది. దీంతో చాలా మంది చిన్న చిన్న నటీనటులు, సిబ్బంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే పలు బడా సినిమాలను నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నారు. ఇది కూడా థియేటర్లకు సమస్యగా మారింది. ఈ క్రమంలోనే సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దని, భవిష్యత్తు అంతా థియేటర్లదే అని.. ఇటీవల తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నిర్మాతలను కోరిన విషం తెలిసిందే. అక్టోబర్‌ 30 వరకు నిర్మాతలందరూ కూడా తమ సినిమాలను ఓటీటీలకు అమ్మకండని విజ్ఞప్తి చేశారు.

అయితే ఇలాంటి సమయంలోనే తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వీఎల్‌ శ్రీధర్‌, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ జాయింట్‌ సెక్రటరీ బాలగోవిందరాజు కీలక ప్రకటన చేశారు. ఏదేమైనా జులై చివరి నాటికి థియేటర్లు ఓపెన్‌ చేస్తామని తేల్చి చెప్పారు. ఆగస్టు 15న రెండు పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయని చెప్పుకొచ్చారు. ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచినా ఓ 15 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయన్నారు. మరి థియేటర్ల పునఃప్రారంభంపై ప్రభుత్వం అనుతమిస్తుందో లేదో వేచి చూడాలి. ఇదిలా ఉంటే ఇప్పటికే కొన్ని సినిమాలను నేరుగా థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు దర్శక, నిర్మాతలు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.

Also Read: Mohan Babu: ఉగ్రదాడిలో మరణించిన ప్రవీణ్ కుమార్ కుటుంబానికి అండగా నిలిచిన మంచు ఫ్యామిలీ..

Amitabh Gifted A Car: గత 10 ఏళ్ల నుంచి రోడ్డుమీద గుంతలను పూడుస్తున్న వృద్ధ జంట.. కారు గిఫ్ట్ ఇచ్చిన అమితాబ్

Director Mani Ratnam: డైరెక్టర్ మణిరత్నం గడ్డం వెనుక సీక్రెట్‌ ఏంటో తెలుసా?