చిన్నా సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద్ సెన్సెషన్ అయిన సినిమా ‘హనుమాన్’. ఈ సినిమాలో హనుమాన్ను చూపించిన తీరు.. అద్భుతమైన విజువల్స్.. డైరెక్షన్ అన్నింటికి అడియన్స్ ఫిదా అయిపోయారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మేకింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇందులో యంగ్ హీరో తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషించారు. ఈనెల 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అటు హిందీలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. అత్యధిక వసూళ్లతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ముఖ్యంగా నార్త్‌లో ఈ సినిమా సత్తా చాటుతుంది. సోమవారం ఒక్కరోజే ఉత్తరాదిలో రూ.2.30 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఇప్పటివరకు ఈ మూవీ రూ. 36.54 కోట్లు వసూళ్లు చేసినట్లుగా తెలిస్తోంది. ప్రస్తుతం నార్త్ ఇండస్ట్రీలో మరో సినిమా పోటీ లేకపోవడంతో హనుమాన్ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ నెల 25న హిందీలో ఫైటర్ సినిమా విడుదల కానుంది. అయితే ఈ మూవీ హనుమాన్ చిత్రానికి ఏ రేంజ్ పోటీ ఇస్తుందో చూడాలి. మరోవైపు త్వరలోనే ఈ మూవీ సీక్వెల్ స్టార్ట్ కానుంది. ఈ మూవీ కంటెంట్ పై తమకు నమ్మకం ఉందని.. కానీ కమర్షియల్ గా ఈ స్థాయి సక్సెస్ అవుతుందని ఊహించలేదని అన్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. కథ, స్క్రీన్ ప్లే, వీఎఫ్ఎక్స్ అన్నీ సమపాళ్లలో కుదరడమే ఈమూవీ ఇంతటి విజయాన్ని సాధించడానికి కారణమని భావిస్తున్నామని.. హనుమంతుడిని ఇష్టపడని వాళ్లంటూ ఉండరు… ముఖ్యంగా పిల్లలంతా హనుమంతుడిని ఎక్కువగా లైక్ చేస్తారని.. వాళ్లంతా సినిమా పట్ల ఆసక్తిని చూపించడమే ఈ స్థాయి వసూళ్లు వచ్చాయని అభిప్రాయాన్ని తెలియజేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
అలాగేఈ సినిమాకు సీక్వెల్ జై హనుమాన్ గా ప్లాన్ చేస్తున్నామని.. సీక్వెల్లో హనుమంతుడి పాత్ర అడియన్స్ ముందుకు వస్తుందని.. హనుమంతుడిగా ఎవరు చేయనున్నారనేది మరికొన్ని రోజుల్లో రివీల్ చేస్తామని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పరంగా ఈ సినిమా ఇండియన్ మూవీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుందనే నమ్మకంగా ఉన్నట్లు తెలిపారు ప్రశాంత్ వర్మ. నార్త్ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగులో ఇప్పటివరకు రూ.2.26 కోట్లు రాబట్టింది ఈ చిత్రం. ఇక మరికొన్ని ఇలాగే హనుమాన్ కలెక్షన్స్ సునామి సృష్టి్స్తుందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.