హనుమాన్ మూవీ దూసుకుపోతోంది. ప్రీమియర్ షోల నుంచే మొదలైన ఈ మూవీ హడావిడీ క్రమంగా పెరుగుతూనే ఉంది. బరిలో పెద్ద సినిమాలున్నప్పటికీ రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింతగా పెరగడం విశేషం. తెలుగుతో పాటు నార్త్‌లోనూ ముఖ్యంగా హిందీలోనూ హనుమాన్ భారీ వసూళ్లు వస్తుండడం విశేషం. ఆదివారం (జనవరి 15) అన్ని భాషల్లో కలిపి రూ. 18 కోట్ల వరకు రాబట్టింది హనుమాన్. తద్వారా ప్రపంచవ్యాప్తంగా మొదటి మూడు రోజులు కలిపి మొత్తం రూ.66 కోట్ల వరకు వసూలు చేసినట్లయింది. ఇందులో ఒక్క మన దేశంలోనే రూ. 42 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే రూ. 29 కోట్ల రాబట్డం విశేషం. ఆ తర్వాత హిందీలో రూ. 13 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అయితే తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం హనుమాన్ సినిమాకు పెద్దగా బజ్ లేదు.
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ లో తేజ సజ్జా హీరోగా నటించాడు. మన దేశంలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందిన మూవీ ఇదే కావడం విశేషం. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించిన హనుమాన్ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. అలాగే వినయ్ రాయ్ విలన్ గా అదరగొట్టాడు. కాగా సరిగ్గా ఇదే సమయంలో అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కూడా హనుమాన్ సినిమాకు మరింత క్రేజ్ తీసుకొచ్చిందని చెప్పడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు.
#HANUMAN won the audience hearts and the audience won their theatres 💪
On Huge Public Demand, Extra Shows being added in NIZAM from Tomorrow 🔥
Experience #HanuManRAMpage in more theaters 💥
– https://t.co/KviKHDJZB1A @PrasanthVarma Film
🌟ing @tejasajja123… pic.twitter.com/HMvEEWsWmC— BA Raju’s Team (@baraju_SuperHit) January 14, 2024
Massive feat achieved by #HANUMAN on @bookmyshow 💥
𝟏𝟎,𝟎𝟎,𝟎𝟎𝟎 Tickets Sold in just 2 Days as everyone witnessed #HanuManRAMpage to the heights 🔥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123#HanuManEverywhere@Niran_Reddy @Actor_Amritha… pic.twitter.com/IKCszeRrrC— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.